Hardik Pandya: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన, ఘాటైన పోస్ట్‌ను షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లో పాండ్యా ఫోటోగ్రాఫర్స్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. వాస్తవానికి ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ వెలుపల హార్దిక్ ప్రియురాలిని కొందరు ఫోటోగ్రాఫర్స్ అనుచితంగా ఫోటోలు తీశారు. దీనికి సంబంధించి ఆయన తాజాగా ఈ పోస్ట్ చేశాడు.
READ ALSO: Asim Munir: ‘‘భారత్‌పై ఈసారి ఘోరంగా దాడి చేస్తాం’’.. పాకిస్తాన్ ‘అసిమ్ మునీర్’ ప్రగల్భాలు..
హార్దిక్ ఈ పోస్ట్‌లో ఒక పబ్లిక్ ఫిగర్‌గా తాను నిరంతరం కెమెరాల దృష్టిలో ఉంటానని అర్థం చేసుకున్నానని, కానీ తాజాగా జరిగింది బౌండ్రీలైన్ దాటిందని ఆయన వెల్లడించాడు. ఆ సమయంలో మహికా మెట్లు దిగుతోందని, కానీ టైంలో ఫోటోగ్రాఫర్స్ తనని అనుచితంగా ఫోటోలు, వీడియోలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. హార్దిక్ మీడియాకు విజ్ఞప్తి చేస్తూ తాను ఎల్లప్పుడూ మీడియాకు సహకరిస్తానని, కానీ ఇలాంటివి అవసరం లేదని పేర్కొన్నాడు. చివరగా హార్దిక్ “దయచేసి కొంత మానవత్వం కలిగి ఉండండి, ధన్యవాదాలు” అని ఈ సుదీర్ఘ పోస్ట్‌ను ముగించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హార్దిక్ విషయానికి వస్తే ఆయన 2025 ఆసియా కప్ సమయంలో గాయపడి రెండు నెలలకు పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. తాజాగా ఈ స్టార్ ఆల్ రౌండర్ మంగళవారం కటక్‌లో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా తరుఫున మైదానంలోకి తిరిగి పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మహికా శర్మ విషయానికి వస్తే ఆమె ఒక ప్రముఖ మోడల్. అలాగే ఆమె మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లలో కూడా మెరిచింది. ప్రస్తుతం పాండ్యా – మహికా రిలేషన్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Akhanda 2: అఖండ 2లో బోయపాటి ఇద్దరు కొడుకులు
