Hardik Pandya: బుమ్రా, బౌల్ట్ ఉన్నా ఫలితం శూన్యం.. ముంబై ఓటమిపై పాండ్యా ఫైర్.. బౌలర్లపై తీవ్ర విమర్శలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై, రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిలో ఓడింది ముంబై. అయితే.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఎదుర్కొన్న పరాజయంపై ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్ల ప్రదర్శనపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. జైస్వాల్ కేవలం కొన్ని ఓవర్లలోనే అజేయంగా 77 పరుగులు చేసి ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లలో 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ముంబై 123 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.
READ MORE: Repo Rate: రెపో రేట్ పై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన.. ఈఎంఐ తగ్గుతుందా?
Also Read
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
ఈ ఓటమికి బ్యాటర్లను నిందించలేమని, బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణమని పాండ్యా స్పష్టం చేశాడు. “టీ20 క్రికెట్లో బౌలర్ల పాత్రం కీలకం. కొన్ని బంతులే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తాయి. మా టీమ్ బౌలర్లు ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యారు. 27 పరుగుల తేడాతో ఓడిపోయామంటే, కేవలం ఒక ఐదు మంచి బంతులు వేసి ఉంటే లేదా ఐదు సిక్సర్లను అడ్డుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది. రాజస్థాన్ ఓపెనర్లు తొలి రెండు ఓవర్లలోనే అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత మేము కేవలం కోలుకోవడానికి ప్రయత్నించడమే సరిపోయింది. ముంబై బౌలింగ్ యూనిట్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. బౌలర్లు బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.” అని పాండ్యా వెల్లడించాడు. మరోవైపు.. రాజస్థాన్ జట్టు అద్భుతమైన క్రికెట్ ఆడిందని మెచ్చుకుంటూనే, తమ బౌలర్లు కనీస స్థాయిలో కూడా రాణించలేదని అసహనం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టులోని స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. వీరంతా కలిసి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టడం గమనార్హం. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మినహా మిగిలిన బౌలర్లందరూ 10 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చారు.
తాజావార్తలు
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?