ఐపీఎల్ లో గుజరాత్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతను బ్యాటింగ్ లో మరోసారి ఫెయిల్ అయ్యాడు. దీంతో గుజరాత్ అభిమానులు తీవ్రస్తాయిలో మండిపడుతున్నారు. జట్టుకు భారంగా మారాడని హార్థిక్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అతను చివరిసారిగా ఎప్పుడు జట్టుకు ఉపయోగపడే ఇన్సింగ్స్ ఆడాడో కనీసం అతనికైనా గుర్తుందా అని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు. రెండు, మూడు మ్యాచ్ లు పక్కన కూర్చోబెడితే కానీ లైన్ లోకి వచ్చేలా కనిపించడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్ కాబట్టి ఎవరు ప్రశ్నించరు అన్న ధీమాతో ఉన్నాడు.. గుజరాత్ యాజమాన్యం అతని విషయం సీరియస్ గా తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Also Read : Rajastan police: 12,854 ప్రదేశాలపై దాడులు… 8,950 మంది నేరస్థులను అరెస్టు
అయితే హార్థిక్ పాండ్యా సహచరులతో అతను ప్రవర్తించే విధానం కూడా అస్సలు బాగోలేదని, బూతులు తిడుతూ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం సరికాదని కేవలం పెత్తన్ చలాయించాలన్నదే అతని మోటోగా కనిపిస్తుందని అంటున్నారు. బౌలింగ్ లోనూ అతని ప్రదర్శన ఏమీ బాగోలేదని, జట్టులో మిగతా సభ్యులంతా తలా ఓ చేయి వేస్తుంటే హార్థిక్ నెట్టుకొస్తున్నాడని చర్చించుకుంటున్నారు. ఇది కూడా తన కెప్టెన్సీ వల్ల అనేలా కలరింగ్ ఇచ్చుకుంటున్నాడని నెటిజన్స్ బహిరంగ కామెంట్స్ చేస్తున్నారు. బౌలింగ్ లో షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్.. బ్యాటింగ్ లో సాహా, గిల్, విజయ్ శంకర్, మిల్లర్,అభినవ్ మనోహర్ రాణిస్తుండటంతో గుజరాత్ వరుస విజయాలు సాధించింది. అయితే ఇందులో హార్థిక్ పాండ్యా పాత్ర, అతని కాంట్రిబ్యూషన్ ఏమాత్రం లేదని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కాగా, ప్రస్తుత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.
Also Read : Karnataka polls: యడియూరప్ప ఒత్తిడిలో మాట్లాడుతున్నారు.. మాజీ సీఎంపై షెట్టర్ ఆసక్తికర వ్యాఖ్య