NTV Telugu Site icon

Hardik Pandya: భారత జట్టు టీ20 సారథిగా హార్దిక్‌ పాండ్యా

Hardik Pandya

Hardik Pandya

ఇంగ్లండ్ లోని ఓవల్ మైదానంలో జరుగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ లో టీమిండియా-ఆస్ట్రేయాలో జట్లు తలపడనున్నాయి. ఈ సీరిస్ అంనతరం భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ లో భాగంగా టీమిండియా ఆతిధ్య జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. సిరీస్‌లు జూలై-ఆగస్టులో జరుగనుంది. అయితే టీ20 సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీకి భారత సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

Also Read: 2000Note: రూ.2000నోటు మార్చడం కంటే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు.. కారణం ?

ఇక వీరి స్థానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదరగొట్టిన రింకూ సింగ్‌, య‌శస్వి జైస్వాల్‌, జితేష్‌ శర్మ వంటి యంగ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో సత్తాచాటిన వెటరన్‌ పేసర్‌ మోహిత్‌ శర్మ కూడా ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. అదే విధంగా హార్దిక్‌ డిప్యూటీగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ క్రికెటర్లను తయారు చేసి పనిలో బీసీసీఐ పడినట్లు తెలుస్తోంది.

Also Read: Adipurush: శ్రీవారి సన్నిధిలో ఆదిపురుష్ టీమ్..సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు..

ఇక మరో వైపు.. రేపటి నుంచి ఇంగ్లండ్ లోని ఓవల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ ట్రోఫి గెలిచేందుకు ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.