Rohit Sharma Gives Update on Hardik Pandya Injury: పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పెద్ద గాయం ఏం కాలేదని, భయపడాల్సిందేం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. హార్దిక్ గాయం నేపథ్యంలో తదుపరి మ్యాచ్‌కు అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రతీ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారని, వారిని మరింత ఉత్సాహపరిచే విజయాలను అందుకుంటామని రోహిత్ చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. ‘హార్దిక్ పాండ్యా ప్రస్తుతం కొద్దిదిగా నొప్పితో బాధపడుతున్నాడు. అయితే అది భయపడాల్సినంత పెద్ద గాయం ఏం కాదు. ఇది కచ్చితంగా భారత జట్టుకు ఓ శుభసూచకం అని చెప్పాలి. అయితే హార్దిక్ గాయం నేపథ్యంలో తదుపరి మ్యాచ్‌కు అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ప్రపంచకప్ కాబట్టి ముందు జాగ్రత్త అవసరం’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
Also Read: Crime News: నంద్యాలలో దారుణం.. కొడుకును కత్తితో పొడిచి చంపిన తండ్రి
‘బంగ్లాపై విజయం అద్భుతం.ఇలాంటి విజయాలపైనే ఫోకస్ పెట్టాం. ఈ మ్యాచ్‌ను మేం గొప్పగా ప్రారంభించలేదు. మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. మా ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. అదే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. ఈ పిచ్‌కు తగిన లైన్ అండ్ లెంగ్త్ బంతులను బౌలర్లు వేశారు. రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే సెంచరీని ఏదీ బీట్ చేయలేదు. ప్రతీ మ్యాచ్‌లో అద్భుత ఫీల్డింగ్ కనబర్చిన ప్లేయర్‌కు అవార్డు ఇస్తున్నాం. ఇది స్పెషల్ మూమెంట్. ప్రతీ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయి జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. వారిని గర్వపడేలా చేస్తాం’ అని రోహిత్ చెప్పాడు.