Site icon NTV Telugu

Hardik Pandya Gambhir Fight: హార్దిక్-గంభీర్ గొడవపడ్డారా? వైరల్‌గా మారిన వీడియో

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya Gambhir Fight: పంజాబ్‌ ముల్లాన్‌పూర్‌లో జరిగిన టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. దీంతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పెద్ద మొత్తంలో పరుగులు సమర్పించుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ప్రదర్శన అధ్వాన్నంగా ఉండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి విమర్శలకు గురయ్యాడు. ఇదే సమయంలో గంభీర్ – హార్దిక్ పాండ్యాలకు సంబంధించిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజానికి ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ ALSO: Vissannapeta Financial Scam: నమ్మించి నట్టేట ముంచిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సంస్థ

గంభీర్ – పాండ్య గొడవపడ్డరా..
నిజానికి ముల్లాన్‌పూర్ మైదానంలో ఓటమి తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉద్రిక్తతలు స్పష్టంగా కనిపించాయి. మ్యాచ్ తర్వాత నుంచి పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక వీడియోలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ – టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మధ్య జరిగిన తీవ్రమైన సంభాషణను చూపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసిన కొంతమంది అభిమానులు, భారత ఓటమి తర్వాత గౌతమ్ గంభీర్ – హార్దిక్ పాండ్యా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని పేర్కొన్నారు. అయితే ఈ వీడియోలో ఆడియో లేకపోవడం కారణంగా వాళ్లిద్దరూ దేని గురించి చర్చిస్తున్నారో అర్థం కాలేదు.

రెండో మ్యాచ్‌లో 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ తన ఖాతా తెరవలేకపోయాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 5 పరుగులకే వెనుదిరిగాడు. ఇక హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తిలక్ వర్మ ఒక్కడు 62 పరుగులతో వీరోచితంగా పోరాడిన, అప్పటికే చాలా ఆలస్యం అయింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ మ్యాచ్‌లో కొంతమంది బ్యాట్స్‌మెన్లు మాత్రమే వారి వారి సాధారణ స్థానాల్లో ఆడారు. దీంతో టీమిండియా ఓటమిలో ఈ కారణం కూడా కీలకంగా మారిందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

ధర్మశాలలో 3వ మ్యాచ్..
ఈ రెండు జట్ల మధ్య మూడో మ్యాచ్ డిసెంబర్ 14న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం. ఈ మ్యాచ్‌లో టీమిండియా బలమైన పునరాగమనం చేయాలని చూస్తోంది.

READ ALSO: AP Chambers Business Expo: భారత్ వైపు ప్రపంచం చూస్తోంది: మంత్రి కొండపల్లి

Exit mobile version