Hardik Pandya: ఒకే ఓవర్‌లో 29 పరుగులు.. హార్దిక్ వీర విహారం
- సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో హార్దిక్ పాండ్యా దూకుడు బ్యాటింగ్
- హాఫ్ సెంచరీతో చెలరేగిన హార్దిక్
- కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్
- 30 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 69 పరుగుల ఇన్నింగ్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో బరోడా విజయాలతో దూసుకెళ్తుంది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఇండోర్ వేదికగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి చేధించి థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. హార్దిక్ పాండ్యా దూకుడు బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పాండ్యా.. ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తం 30 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 69 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
Read Also: CM Chandrababu: ఇసుకపై సీఎం సమీక్ష.. ఫిర్యాదుల నేపథ్యంలో కీలక ఆదేశాలు.. రేపటి నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్
Also Read
హార్దిక్‌తో పాటు భాను పానియా 42 పరుగులతో రాణించాడు. దీంతో.. బరోడా 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. తమిళనాడు బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి3, సాయికిషోర్ 2 వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ అర్ధ సెంచరీ (57) ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. విజయ్ శంకర్(42), షరూఖ్ ఖాన్(39) పరుగులతో రాణించారు. బరోడా బౌలర్లలో మెరివాలా మూడు వికెట్లు పడగొట్టగా.. మహేష్ పతియా, నినాంద్ రత్వా తలా వికెట్ సాధించారు.
6⃣,6⃣,6⃣,6⃣,4⃣
One goes out of the park 💥
Power & Panache: Hardik Pandya is setting the stage on fire in Indore 🔥🔥
Can he win it for Baroda?
Scorecard ▶️ https://t.co/DDt2Ar20h9#SMAT | @IDFCFIRSTBank pic.twitter.com/Bj6HCgJIHv
— BCCI Domestic (@BCCIdomestic) November 27, 2024
Read Also: Ajmer Sharif Dargah: “అజ్మీర్ షరీఫ్ దర్గా ఒక శివాలయం”.. విచారణకు అంగీకరించిన కోర్టు..
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!