NTV Telugu Site icon

Hardik Pandya: ఒకే ఓవర్‌లో 29 పరుగులు.. హార్దిక్ వీర విహారం

Hardhik Pandya

Hardhik Pandya

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో బ‌రోడా విజయాలతో దూసుకెళ్తుంది. ఈ టోర్నీలో భాగంగా బుధ‌వారం ఇండోర్ వేదిక‌గా త‌మిళ‌నాడుతో జ‌రిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 222 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఆఖ‌రి బంతికి చేధించి థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. హార్దిక్ పాండ్యా దూకుడు బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పాండ్యా.. ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తం 30 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 69 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

Read Also: CM Chandrababu: ఇసుకపై సీఎం సమీక్ష.. ఫిర్యాదుల నేపథ్యంలో కీలక ఆదేశాలు.. రేపటి నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్

హార్దిక్‌తో పాటు భాను పానియా 42 ప‌రుగుల‌తో రాణించాడు. దీంతో.. బ‌రోడా 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. త‌మిళ‌నాడు బౌల‌ర్లలో స్పిన్నర్లు వ‌రుణ్ చ‌క్రవ‌ర్తి3, సాయికిషోర్ 2 వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ అర్ధ సెంచరీ (57) ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. విజ‌య్ శంక‌ర్‌(42), షరూఖ్ ఖాన్‌(39) ప‌రుగుల‌తో రాణించారు. బరోడా బౌలర్లలో మెరివాలా మూడు వికెట్లు ప‌డ‌గొట్టగా.. మ‌హేష్ ప‌తియా, నినాంద్ ర‌త్వా త‌లా వికెట్ సాధించారు.

Read Also: Ajmer Sharif Dargah: “అజ్మీర్ షరీఫ్ దర్గా ఒక శివాలయం”.. విచారణకు అంగీకరించిన కోర్టు..