Site icon NTV Telugu

Hardik Pandya Engagement: హార్దిక్ పాండ్యా, మహికా శర్మల నిశ్చితార్థం..? వీడియో వైరల్..!

Hardik Pandya Engagement

Hardik Pandya Engagement

Hardik Pandya Engagement: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నటి మహికా శర్మ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల వీరిద్దరూ ఒక దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి చేసిన పూజా కార్యక్రమం ఇప్పుడు వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఆధారంగా చాలామంది నెట్‌జన్లు వీరు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని ప్రచారం మొదలెట్టారు. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో హార్దిక్, మహికా పక్కపక్కన కూర్చుని పూజలో పాల్గొంటున్నట్టు కనిపించారు. కుటుంబసభ్యుల మధ్య జరిగిన ఈ ప్రత్యేక పూజను అభిమానులు ఇది సాధారణ పూజ కాదని, వారి రహస్య ఎంగేజ్మెంట్ కార్యక్రమమని భావిస్తున్నారు.

Shah Rukh Khan: నిన్ను ఆ జెర్సీలో మరోదానిలో చూడలేను.. షారుఖ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్..!

మరోవైపు కొన్ని రిపోర్టులు కూడా ఈ పూజ నిజంగా ప్రైవేట్ ఎంగేజ్మెంట్‌నే అని పేర్కొన్నాయి. అయితే ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా లేదా మహికా శర్మ ఇద్దరి నుండి కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. గత కొద్ది నెలలుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట తొలిసారిగా అక్టోబర్‌లో హార్దిక్ పుట్టినరోజు వారంలో పబ్లిక్‌గా కనిపించారు. హార్దిక్ ఇటీవల అదే పూజ సమయంలో తీసిన ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో రూమర్స్ మరింత పెరిగాయి. ఆయన రాసిన “Big 3 in my life.. cricket, Agastya, and Mahieka Sharma” అనే క్యాప్షన్ అభిమానుల్లో పెద్ద చర్చకు కూడా దారి తీసింది.

అయితే ఈ ఎంగేజ్‌మెంట్ వార్తలు వేగంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో పూజ నిర్వహించిన పూజారి క్లారిటీ ఇచ్చాడు. ఈ పూజ ఏ నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధించినది కాదని.. కేవలం కుటుంబ శ్రేయస్సు కోసం మాత్రమే నిర్వహించిన సాధారణ పూజ అని ఆయన స్పష్టం చేశాడు. కాబట్టి, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ రూమర్స్‌ను నమ్మకూడదని అభిమానులకు సూచించారు.

Mana Shankaravaraprasad Garu: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లపై అదిరిపోయే మాస్ డ్యాన్స్ సాంగ్..!

ఇక క్రికెట్ విషయానికి వస్తే.. హార్దిక్ పాండ్యా జాతీయ జట్టులో తిరిగి ప్రవేశం మరింత ఆలస్యం కానుంది. 2025 మెన్స్ టీ20 ఆసియా కప్ సమయంలో ఆయనకు ఏర్పడిన గాయానికి సంబంధించిన రిహాబిలిటేషన్ ఇంకా పూర్తికాలేదు. దాంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు హార్దిక్ అందుబాటులో ఉండరని సమాచారం. అంతేకాదు, ఆయన పూర్తి ఆరోగ్యంతో మైదానంలోకి అడుగుపడే వరకు జట్టు నిర్వహణ కూడా అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది.

Exit mobile version