Hardik Pandya Engagement: హార్దిక్ పాండ్యా, మహికా శర్మల నిశ్చితార్థం..? వీడియో వైరల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Engagement: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నటి మహికా శర్మ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల వీరిద్దరూ ఒక దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి చేసిన పూజా కార్యక్రమం ఇప్పుడు వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఆధారంగా చాలామంది నెట్‌జన్లు వీరు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని ప్రచారం మొదలెట్టారు. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో హార్దిక్, మహికా పక్కపక్కన కూర్చుని పూజలో పాల్గొంటున్నట్టు కనిపించారు. కుటుంబసభ్యుల మధ్య జరిగిన ఈ ప్రత్యేక పూజను అభిమానులు ఇది సాధారణ పూజ కాదని, వారి రహస్య ఎంగేజ్మెంట్ కార్యక్రమమని భావిస్తున్నారు.
Shah Rukh Khan: నిన్ను ఆ జెర్సీలో మరోదానిలో చూడలేను.. షారుఖ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్..!
Also Read
మరోవైపు కొన్ని రిపోర్టులు కూడా ఈ పూజ నిజంగా ప్రైవేట్ ఎంగేజ్మెంట్‌నే అని పేర్కొన్నాయి. అయితే ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా లేదా మహికా శర్మ ఇద్దరి నుండి కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. గత కొద్ది నెలలుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట తొలిసారిగా అక్టోబర్‌లో హార్దిక్ పుట్టినరోజు వారంలో పబ్లిక్‌గా కనిపించారు. హార్దిక్ ఇటీవల అదే పూజ సమయంలో తీసిన ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో రూమర్స్ మరింత పెరిగాయి. ఆయన రాసిన “Big 3 in my life.. cricket, Agastya, and Mahieka Sharma” అనే క్యాప్షన్ అభిమానుల్లో పెద్ద చర్చకు కూడా దారి తీసింది.
అయితే ఈ ఎంగేజ్‌మెంట్ వార్తలు వేగంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో పూజ నిర్వహించిన పూజారి క్లారిటీ ఇచ్చాడు. ఈ పూజ ఏ నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధించినది కాదని.. కేవలం కుటుంబ శ్రేయస్సు కోసం మాత్రమే నిర్వహించిన సాధారణ పూజ అని ఆయన స్పష్టం చేశాడు. కాబట్టి, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ రూమర్స్‌ను నమ్మకూడదని అభిమానులకు సూచించారు.
ఇక క్రికెట్ విషయానికి వస్తే.. హార్దిక్ పాండ్యా జాతీయ జట్టులో తిరిగి ప్రవేశం మరింత ఆలస్యం కానుంది. 2025 మెన్స్ టీ20 ఆసియా కప్ సమయంలో ఆయనకు ఏర్పడిన గాయానికి సంబంధించిన రిహాబిలిటేషన్ ఇంకా పూర్తికాలేదు. దాంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు హార్దిక్ అందుబాటులో ఉండరని సమాచారం. అంతేకాదు, ఆయన పూర్తి ఆరోగ్యంతో మైదానంలోకి అడుగుపడే వరకు జట్టు నిర్వహణ కూడా అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది.
Star cricketer from Vadodara, Hardik Pandya got engaged again in a private ceremony!#Hardikpandyapic.twitter.com/hTCLmGweaS
— My Vadodara (@MyVadodara) November 30, 2025
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!