Hardik Pandya: ఈ రోజు టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పుట్టిన రోజు. అక్టోబర్ 11, 1993న గుజరాత్‌లో జన్మించాడు. భారత క్రికెట్‌లో కపిల్‌దేవ్ తర్వాత ఆ స్థాయి ఆల్‌రౌండర్ ఎవరు..? ఈ ప్రశ్నకి సుదీర్ఘకాలం తర్వాత హార్దిక్ పాండ్యా ఓ సమాధానంలా నిలిచాడు. టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తొలినాళ్లలోనే తన పేస్ బౌలింగ్‌తో పాటు పవర్ హిట్టింగ్‌తోనూ స్టార్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఎదిగాడు. కానీ.. ఈ మూడేళ్ల క్రికెట్ కెరీర్‌లో ఆట కంటే ఆటేతర కారణాలతో హార్దిక్ పాండ్యా ఎక్కువగా ఇబ్బందులు పడ్డాడు. అనంతరం.. హార్దిక్ పాండ్యా అంటేనే ఓ వివాదంలా మారిపోయాడు. కానీ.. ఎన్ని అడ్డంకులు వచ్చిన తన చక్కటి ప్రదర్శనతో అన్నింటికీ చెక్ పెడుతూనే ఉంటాడు.
READ MORE: Boy dies with Hot Tea: వేడి వేడి టీ తాగి బాలుడు మృతి
అయితే.. తాజాగా హార్దిక్ పాండ్యా మరోసారి ప్రేమలో పడ్డాడు? క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల ముంబై విమానాశ్రయంలో తన స్నేహితురాలు, మోడల్-నటి మహికా శర్మతో కలిసి కనిపించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. మహికా, హార్దిక్ ఇద్దరూ నల్లటి దుస్తులలో కనిపించారు. ఇంతకీ మహికా శర్మ ఎవరు అనే ప్రశ్న మొదలైంది. అయితే.. మహికా తనిష్క్, వివో, యునిక్లో వంటి ప్రధాన బ్రాండ్ల ప్రకటనలలో కనిపించింది. ఫ్యాషన్ ప్రపంచంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
READ MORE: BC Reservations: బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు ఆర్డర్ కాపీ.. జీఓ 9, 41, 42 ల పై స్టే
ఇటీవల.. హార్దిక్ పాండ్యాకు నటాషాతో విడాకులు అయిన విషయం తెలిసిందే. విడాకుల అనంతరం మోడల్ జాస్మిన్ వాలియాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు వార్తలు వ్యాపించాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగింది. అయితే.. ఈ పుకార్లపై ఇద్దరూ స్పందించలేదు. ఈ గుసగుసలు సద్దుమణగక ముందే, పాండ్యా మరో కొత్త మోడల్‌తో డేటింగ్‌లో ఉన్నాడన్న రూమర్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు శుక్రవారం నాడు కొత్త ప్రియురాలు మహికా శర్మతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, అన్ని అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టాడు హార్దిక్. బర్త్ డే వేడుకలను మహికాతో కలిసి హార్దిక్ జరుపుకొన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ జంట రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. మహికా ఎవరు అనే ప్రశ్న మొదలైంది. కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలలో నటించింది మహికా. వీటిలో వివేక్ ఒబెరాయ్‌తో కలిసి నటించిన ‘ఇన్ టు ది డస్క్’, ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాలు ఉన్నాయి. మహికా తనిష్క్, వివో, యునిక్లో వంటి ప్రధాన బ్రాండ్ల ప్రకటనలు సైతం చేసింది.