NTV Telugu Site icon

IND vs SL: శ్రీలంక పర్యటన.. భారత జట్టుకు ఇద్దరు కెప్టెన్స్!

Team India

Team India

Hardik Pandya Likely To a India T20 Captain: టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి జోష్‌లో ఉన్న భారత్.. జింబాబ్వేపై 4-1తో టీ20 సిరీస్‌ను గెలిచింది. ఇక శ్రీలంక పర్యటనకు సిద్దమవుతోంది. లంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 26 నుంచి టీ20 సిరీస్.. ఆగస్టు 1 నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం కానున్నాయి. అయితే ఈ టూర్‌లో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అని చాలా మంది అంటున్నారు.

టీ20 ప్రపంచకప్‌ 2024 అనంతరం రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అద్భుత ప్రదర్శనతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. గతంలో కూడా టీమిండియాకు అతడు సారథ్యం వహించాడు. కెప్టెన్సీ రేసులో హార్దిక్ ముందున్నప్పటికీ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌దే తుది నిర్ణయం అని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

Also Read: Rishabh Pant-IPL 2025: రికీ పాంటింగ్ ఔట్.. నెక్స్ట్‌ టార్గెట్‌ రిషబ్ పంత్!

మరోవైపు శ్రీలంక టూర్‌లోని వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడే అవకాశాలు తక్కువ. తీరిక లేని క్రికెట్ ఆడుతున్న రోహిత్.. విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. దాంతో వన్డేలకు కెప్టెన్‌గా ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ రేసులో ఉన్నా.. బీసీసీఐ ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఓ క్రీడా ఛానెల్ నివేదిక ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని, అతడే సారథిగా ఉంటాడని పేర్కొంది. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను అయ్యర్ ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ జట్టుకు గౌతమ్ గంభీర్ మెంటార్. దాంతో అయ్యర్‌ను వన్డే కెప్టెన్‌గా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Show comments