Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Birthday: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నేడు తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సాధారణ కుటుంబంలో జన్మించి నేడు భారత క్రికెట్లో సూపర్‌స్టార్‌గా ఎదిగిన హార్దిక్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. బ్యాట్, బాల్ రెండింటితోనూ జట్టుకు అద్భుతమైన సమతుల్యతను అందించిన అతడు, ప్రస్తుతం భారత్ నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందాడు. అయితే గాయాల కారణంగా కొంతకాలంగా హార్దిక్ కెరీర్‌కు అప్పుడప్పుడు బ్రేకులు పడుతున్నాయి. ప్రస్తుతం కూడా గాయం కారణంగా టీమిండియా సెటప్‌కు దూరంగా ఉన్నప్పటికీ, త్వరలోనే పూర్తి ఫిట్నెస్తో రీఎంట్రీ ఇస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన కష్టాల నుంచి కోట్లకు అధిపతిగా ఎలా ఎదిగారనే ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.
హార్దిక్ ప్రారంభ జీవితం ఎంతో కష్టాలతో కూడుకుని సాగింది. అతడి తండ్రి హిమాన్షు పాండ్యా సూరత్‌లో కార్ ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు. కానీ అందులో తీవ్ర నష్టం రావడంతో కుటుంబం మొత్తం వడోదరకు మలసవలసి వచ్చింది. ఇంట్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో హార్దిక్ స్కూల్ చదువు కూడా ఆగిపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే, హార్దిక్, అతడి అన్న కృణాల్ కేవలం మ్యాగీ తింటూ రోజంతా గడిపిన రోజులు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారడంతో స్వయంగా క్రికెట్ కిట్ కొనుగోలు చేసే స్తోమత కూడా లేక, ఇతరుల దగ్గర కిట్ తీసుకుని ఆడేవారు. కొద్దిపాటి డబ్బుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి మరీ క్రికెట్ ఆడేవారు. కానీ హార్దిక్ తన కలను మాత్రం ఎప్పటికీ వదులుకోలేదు. వనరుల కొరత వేధించినా ఎక్కడా వెనకడుగు వేయకుండా కష్టపడి ముందుగా లోకల్ టోర్నమెంట్లు, ఆ తర్వాత స్టేట్ టీమ్, చివరకు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు.
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2015లో ముంబై ఇండియన్స్‌తో హార్దిక్ ఒప్పందం కుదుర్చుకున్న క్షణం అతడి తలరాతనే మార్చేసింది. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన కొద్ది నెలల్లోనే భారత జాతీయ జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హార్దిక్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తన అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియాలో కీలక ఆటగాడిగా మారి, ప్రపంచంలోనే నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా అవతరించాడు. క్రికెట్ మైదానంలో ఈ విజయాలతో పాటు అతడికి భారీగా పేరుప్రఖ్యాతులు, సంపద వచ్చాయి. ఐపీఎల్, టీమిండియాలలో రాణించడంతో పెద్ద పెద్ద బ్రాండ్లు ఆయన వెనుక పరిగెత్తాయి. ఒక్కో ప్రకటన కోసం కోట్ల రూపాయలతో డీల్స్ కుదిరాయి. చిన్ననాటి కష్టాలను ఎదుర్కొన్న హార్దిక్, నేడు తాను కలలు కన్న ప్రతి విలాసాన్ని అనుభవిస్తున్నారు.
నేడు హార్దిక్ చేతికి కోట్ల విలువ చేసే గడియారాలు కనిపిస్తాయి. బట్టల మాదిరిగా కార్లను మారుస్తుంటాడు. ఒకప్పుడు పూట గడవడానికి మ్యాగీ తిన్న హార్దిక్, ఇప్పుడు విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు తన ఫిట్నెస్ దెబ్బతినకుండా ఉండేందుకు ఏకంగా సొంత ఖర్చులతో కోచ్‌ను కూడా వెంట తీసుకెళ్తాడు. నివేదికల ప్రకారం హార్దిక్ పాండ్యా నికర ఆస్తుల విలువ 95 నుంచి 120 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా. ఐపీఎల్, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా వచ్చే జీతమే హార్దిక్ ప్రధాన ఆదాయ వనరు. ఇవే కాకుండా బోట్, రిలయన్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటి పలు పెద్ద బ్రాండ్లతో కోట్ల రూపాయల వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్నాడు. ముంబై, వడోదరలలో విలాసవంతమైన ఇళ్లు, స్టార్టప్‌లలో ఈక్విటీ పెట్టుబడులు, లగ్జరీ కార్లు, వాచ్‌ల భారీ కలెక్షన్ హార్దిక్ సొంతం.
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!