Harbhajan-Akhtar: భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే క్రీడాభిమానులకు పండగే. అయితే ఈ రెండు జట్లు కలిస్తే మాటల తూటాలు, భావోద్వేగాలు, అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు కూడా మామూలే. కిరణ్ మోరే – జావేద్ మియాందాద్, అమీర్ సొహైల్ – వెంకటేశ్ ప్రసాద్ మధ్య జరిగిన ఘర్షణలు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో నేటి కూడా సజీవంగా ఉన్నాయి. అయితే హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన మాత్రం కొంచెం విచిత్రం. వీరి మధ్య జరిగిన మాటల యుద్ధం తారా స్థాయికి వెళ్లింది. 2010లో శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌ను ఎవ్వరూ మర్చిపోలేరు. హర్భజన్ సింగ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షోయబ్ అక్తర్ బౌలింగ్ చేస్తూ హర్భజన్‌పై మాటల తూటాలు పేల్చారు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గొడవపడ్డారు. కాసేపటికి కోపంతో ఊగిపోతున్న హర్భజన్ షోయబ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టారు. ఈ ఘటన అప్పట్లో క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Beer Price Hike: తెలంగాణలో బీర్ల ధరలు పెంపు.. నేటి నుంచే అమల్లోకి!
ఇప్పుడు హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ క్రికెట్‌కు రిటైర్ అయిన తర్వాత మంచి స్నేహితులుగా మారిపోయారు. తాజాగా వీరిద్దరూ దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ T20 (ILT20) 2025లో బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. మ్యాచ్‌లకు విశ్లేషణతో పాటు తీరిక సమయాల్లో అభిమానులకు వినోదాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా 2010లో జరిగిన గొడవను మళ్లీ రీక్రియేట్ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అదే సంఘటనను హాస్యరసంగా మళ్లీ రీక్రియేట్ చేసారు. ఆ సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షోయబ్ అక్తర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘‘”ఇదే మా ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమయ్యే విధానం!” హర్భజన్, నీ మాట ఏంటి? అంటూ సరదాగా చమత్కరించారు.
Also Read: YS Jagan : వైఎస్ 2.0లో ఊహించని అంశాలు? ఓటమి తర్వాత జగన్ మారిపోయారా?
ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో జరిగిన ఆసక్తికర సంఘటనల్ని గుర్తుచేసుకుంటూ అభిమానులు మళ్లీ రసవత్తర పోరుకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద హర్భజన్, షోయబ్ మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఇప్పుడు స్నేహానికి చిహ్నంగా మారింది. ఇలాగే రానున్న మ్యాచ్‌లో కూడా కేవలం క్రీడాస్ఫూర్తి చూపించాలని క్రికెట్ అభిమానుల ఆశిస్తున్నారు.