తెలుగు రాష్ట్రాలలో మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారికి ‘హ్యాపీ మొబైల్స్’ సంస్థ శుభవార్త అందించింది. రిపబ్లిక్ డే సందర్భంగా మూడు రోజుల పాటు ఫ్లాష్ సేల్ నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా షావోమీ భాగస్వామ్యంతో షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసినట్లు హ్యాపీ సంస్థ తెలిపింది. ప్రో గ్రేడ్ 108 మెగాపిక్సల్ కెమెరా, అత్యద్భుతమైన 6.67 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ + 120 హెర్జ్ అమోలెడ్ డిస్‌ప్లే, సౌండ్ బై హర్మాన్ కార్డన్‌తో డ్యూయల్ స్పీకర్లు ఈ ఫోన్ ప్రత్యేకతలుగా వివరించింది. వినియోగదారులకు అత్యుత్తమైన అనుభవాన్ని ఈ ఫోన్ అందిస్తుందని నమ్మకం వ్యక్తం చేసింది.
Read Also: ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్
షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌ను బిగ్‌బాస్-5 విజేత సన్నీ ఆవిష్కరించాడు. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల ఈఫోన్ రూ.39,999కి లభిస్తుందని… 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ గల ఈ ఫోన్ రూ.43,999కి లభ్యం అవుతుందని హ్యాపీ సంస్థ తెలిపింది. వినియోగదారులు సిటీ బ్యాంకు కార్డులు, క్రెడిట్ ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించి 5వేల ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ పొందవచ్చని సూచించింది. అదనంగా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరో రూ.5వేలు తగ్గింపు పొందవచ్చని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది చివరి నాటికి 120 స్టోర్లను తెరిచేందుకు హ్యాపీ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కంపెనీ సీఎండీ కృష్ణపవన్ కుంజేటి, ఈడీ సంతోష్ కోటా తెలిపారు. వినియోగదారులు తమపై చూపుతున్న అభిమానం, నమ్మకానికి ధన్యవాదాలు తెలియజేశారు.