NTV Telugu Site icon

MS Dhoni Birthday: భారత సైన్యంలో మంచి పొజిషన్.. ఎంఎస్ ధోనీ ఆర్మీ జర్నీ గురించి తెలుసా?

Ms Dhoni Army Journey

Ms Dhoni Army Journey

All about GOAT MS Dhoni’s stint with Indian Territorial Army: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మోస్ట్ సక్సెస్ ఫుల్ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. ధోనీ మంచి క్రికెటర్ మాత్రమే కాకూండా.. ఫుట్ బాల్ ప్లేయర్ కూడా. బైక్స్ నడపడం, వ్యవసాయం చేయడం కూడా మహీకి మహా ఇష్టం. వీటన్నింటికి కంటే ఎక్కువగా ధోనీ దేశాన్ని ప్రేమిస్తాడు. దేశం పట్ల ఎంతో అంకిత భావంతో ఉంటాడు. భారత సైన్యంలో అతడికి మంచి పొజిషన్ ఉండడమే ఓ మంచి ఉదాహరణ. నేడు ధోనీ 42వ పుట్టినరోజు సందర్భంగా మహీ ఆర్మీ జర్నీ గురించి ఓసారి చూద్దాం.

2011లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ వన్డే ప్రపంచకప్ అందుకున్న విషయం తెలిసిందే. అందుకు గౌరవంగా భారత సైన్యంలో భాగమైన టెరిటోరియల్ ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్‌ పదివిని ఇచ్చి గౌరవించింది. అప్పటినుంచి ధోనీ సమయం దొరికినప్పుడల్లా భారత ఆర్మీకి సంబంధించిన కార్యక్రమాలు, శిక్షణలో పాల్గొంటున్నాడు. 2018లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆ సమయంలో ఆర్మీ యూనిఫారంలోనే ధోనీ కార్యక్రమానికి హాజరయి అవార్డును అందుకున్నాడు.

Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీకి గుర్తింపు వచ్చింది తెలుగు గడ్డపైనే.. ఆ విధ్వంసాన్ని ఎవరూ మర్చిపోలేరు!

టెరిటోరియల్ ఆర్మీ తర్వాత 106 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ టీఏ పారాలో (ఎలైట్ ఫోర్స్) ఎంఎస్ ధోనీ భాగమయ్యాడు. ఇప్పటివరకు ఏ ప్లేయర్ చేయని కఠిన శిక్షణను కూడా ధోనీ తీసుకున్నాడు. 2015 ఆగష్టులో రెండు వారాల కఠోర శిక్షణ అనంతరం ఆగ్రాలో 15,000 అడుగుల ఎత్తు నుంచి పారా జంప్ చేశాడు. ఐదుసార్లు పారా జంప్ చేసిన ధోనీ.. మిగిలిన సైనికులతో పాటు వింగ్స్ (యూనిఫాంలో నీలం రంగు రెక్కలు, పారాచూట్ గుర్తు) అందుకున్నాడు. ఆపై పాకిస్తాన్ సరిహద్దు దగ్గర గస్తీ కూడా కాచాడు. పెట్రోలింగ్ డ్యూటీ కూడా చేశాడు.

2019లో ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో భారత్ ఓటమి అనంతరం ఎంఎస్ ధోనీ చాలా నెలలు జట్టుకు దూరమయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో స్పెషల్ ఫోర్స్ యూనిట్‌లో చేరాడు. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సుమారు రెండు వారాల పాటు గడిపాడు. బోర్డర్ వద్ద గస్తీ కాచాడు. కఠిన శిక్షణ తీసుకుని సాధారణ జవాన్ చేసే పనులు అన్ని చేశాడు. అప్పుడు దేశమంతటా ధోనీ పేరు మార్మోగిపోయింది. చివరకు ఎన్నో నెలల సస్పెన్స్ తర్వాత 2020 ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు.

Also Read: World Cup 2023 Qualifiers: స్కాట్లాండ్‌పై సంచలన విజయం.. వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్‌ అర్హత!

Show comments