Happy Birthday Brahmanandam: మీమ్స్ రాజు.. నవ్వుల రారాజు..హాస్య బ్రహ్మ బ్రహ్మానందం బర్త్ డే ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా చరిత్రలో కామెడీని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లిన నటుడు బ్రహ్మానందం. 1,000 కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఆయన, కేవలం ఒక నటుడిగానే కాకుండా ఒక ఎమోషన్ లాగా మారిపోయారు. బ్రహ్మానందం గారి ప్రయాణం కేవలం వెండితెరకే పరిమితం కాలేదు. సినిమాల్లోకి రాకముందు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. అందుకే ఆయన మాటల్లో స్పష్టత, సాహిత్యంపై పట్టు ఎక్కువగా కనిపిస్తుంటుంది. దర్శకుడు జంధ్యాల గారు ఆయనలోని హాస్య చతురతను గుర్తించి ‘అహ నా పెళ్ళంట’లో అరగుండు పాత్రను ఇచ్చారు. ఆ ఒక్క సినిమాతో ఆయన దశ తిరిగింది. అక్కడి నుండి మొదలైన ఆయన ప్రయాణం వెయ్యి సినిమాలకు పైగా సాగడం ఒక అద్భుతం.
Also Read : Sreeleela :పెళ్ళాన్ని అడిగినట్టు అడిగారు!.. అబ్బాయిల డిమాండ్‌పై శ్రీలీల క్రేజీ పంచ్!
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
అంతే కాదు ఒకే భాషలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. అందుకే ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్లు వచ్చినా, బ్రహ్మానందం స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. నేటి యంగ్ హీరోలు సైతం తమ సినిమాల్లో బ్రహ్మీ ఒక్క సీన్ లో ఉన్నా సినిమా రేంజ్ మారుతుందని నమ్ముతారు. వయసు రీత్యా ఆయన ఇప్పుడు సినిమాలు తగ్గించినప్పటికీ, ‘రంగమార్తాండ’లో ఆయన చేసిన సీరియస్ రోల్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. హాస్యాన్నే కాదు, అద్భుతమైన నటనను కూడా పండించగలనని ఆయన మరోసారి నిరూపించారు.
బ్రహ్మీ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు థియేటర్లో నవ్వులు పూయాల్సిందే. ఎన్నో సినిమాల్లో గాలి శీను (గౌతమ్ ఎస్సెస్సీ), భట్టు (అదుర్స్), పద్మశ్రీ (దూకుడు), కిల్ బిల్ పాండే (రేసుగుర్రం).. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికీ ఆయనో ఫేవరెట్ క్యారెక్టర్ ఉంటుంది. ముఖ్యంగా నేడు సోషల్ మీడియాలో ఏ చిన్న సంఘటన జరిగినా బ్రహ్మానందం మీమ్ లేకుండా పోస్ట్ పడదు అంటే ఆయన ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా అలాంటి ఈ హాస్య శిఖరానికి మా తరపున తెలుగు ప్రేక్షకులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!