ఈ మధ్య దేవుళ్ళకు సంబందించిన సినిమాలు రావడం చాలా తక్కువ.. ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ కూడా రొమాన్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నాయి.. గతంలో వచ్చిన భక్తి రస సినిమాలు ఓ రేంజులో ప్రేక్షకుల ఆదరణను పొందాయి.. అందులో అమ్మోరు అయితే ఒక సంచలనం.. ఇప్పుడు వచ్చిన హనుమాన్ సినిమా మరో రికార్డు ను క్రియేట్ చేసింది..
అప్పట్లో అమ్మోరు సినిమాలు చూస్తూ జనాలకు ఎలాగైతే పూనకాలు వచ్చాయో ఇప్పుడు హనుమాన్ సినిమాను చూస్తూ ఓ మహిళకు అలానే జరిగింది.. హనుమాన్ మూవీ చూస్తున్న ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ జోరు థియేటర్లలో ఇంకా తగ్గలేదు.. మూడు వారాలు గడుస్తున్నా జనాలు థియేటర్స్ కి పోటెత్తుతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. హైదరాబాద్ ఉప్పల్ లో గల ఏషియన్ థియేటర్లో హనుమాన్ మూవీ వస్తుంది..
అయితే క్లైమాక్స్ లో ఓ మహిళ పూనకాలు వచ్చిన విధంగా వింతగా ప్రవర్తించింది.. పెద్దగా కేకలు వేస్తూ కుర్చీలో మెలికలు తిరిగిపోయింది. పక్కనే ఉన్న వారంతా ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.. కాసేపు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. సదరు మహిళ ప్రవర్తన చూసి పక్కనే ఆడియన్స్ విస్తుపోయారు.. చివర్లో ఆంజనేయ స్వామి వస్తారు..ఈ క్రమంలో ఆమెకు పూనకం వచ్చిందని కొందరు అంటున్నారు. మరికొందరేమో ఆమెకు ఫిట్స్ వచ్చాయని కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా మహిళ చేసిన పనికి థియేటర్లో రచ్చ రచ్చ జరిగింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..