Site icon NTV Telugu

Hanumakonda: వాహ్ ఏం ఐడియా సర్.. అధిక సౌండ్ చేసే సైలెన్సర్లతో ఏం చేశారో చూడండి..

Hanumakonda Police

Hanumakonda Police

నగరం, పట్టణాల్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా శబ్ధ కాలుష్యం రోజు రోజుకూ అధికమవుతోంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను అధిక తీవ్రత కలిగిన శబ్దాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హారన్లు, సైలెన్సర్ల వినియోగంతో పలుచోట్ల పరిమితికి మించి శబ్దకాలుష్యం నమోదవుతోంది. దీంతో ప్రజలకు అనారోగ్య, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి.

READ MORE: Aadi Saikumar : ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లింగ్ ‘శంబాల’ టీజర్ రిలీజ్..

ఇక మీద ఈ సమస్యను పరిష్కరించేందుకు హనుమకొండ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఆలోచన చేశారు. అధిక సౌండ్ చేసే సైలెన్సర్లను ఊడదీసి భారీ కేట్ ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో విద్యార్థులు, యువత తమ ద్విచక్ర వాహనాలకు అధిక పొల్యూషన్ చేసే సైలెన్సర్లు అమర్చుతున్నారు. అధిక పొల్యూషన్ చేస్తూ పట్టుబడిన వాహనాల నుంచి తీసేసిన సైలెన్సర్లతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదురుగా భారీకెట్ ఏర్పాటు చేశారు. ఎవరైతే సైలెన్సర్ మార్చి అధిక పొల్యూషన్ చేస్తున్న వారికి ఇది ఒక హెచ్చరిక లాగా పనిచేస్తుందని హనుమకొండ ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి చెబుతున్నారు. సైలెన్సర్లు మార్చి వాహనాలు నడిపే యువతకు, ప్రజలకు మంచి మెసేజ్ వెళుతుందని ఈ వినూత్నమైన ఆలోచన చేసినట్లు తెలిపారు. రాబోయే రోజులలో నగరంలోని అనేక కూడళ్ళలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

READ MORE: Bajaj 125cc Bike: బజాజ్ కొత్త 125cc బైక్‌.. విడుదలయ్యేది అప్పుడే!

పర్యావరణ నిబంధనల ప్రకారం.. ద్విచక్ర వాహనం నుంచి ట్రాక్టర్‌ వరకు ప్రతి వాహనానికి శబ్ద నాణ్యత ప్రమాణాలు పాటించేలా, సైలెన్సర్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. శబ్ద కాలుష్యాన్ని కట్టడిచేసేందుకు నగర ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించాలి. శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్న వాహనదారులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు, యువత తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

Exit mobile version