NTV Telugu Site icon

Shimla Rains: షిమ్లాలో వర్ష బీభత్సం.. గాల్లో రైల్వే ట్రాక్

Shimla

Shimla

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారీ వర్షాల ధాటికి షిమ్లా సమ్మర్ హిల్‌లో ఒక చోట రైల్వే ట్రాక్ కింద ఉన్న భూభాగం వరదలకు కొట్టుకుపోయింది. దీంతో రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతూ ఉంది. ఇది సాధారణ రైల్వే ట్రాక్ కాదని.. పర్యాటకం కోసం యునెస్కో ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. ఈ ట్రాక్ పై టాయ్ ట్రైన్ ప్రయాణిస్తుందని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ పర్యాటకంలో షిమ్లా సమ్మర్ హిల్ ఒక భాగం. ఇక్కడ టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా మందికి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. అందుకోసం యునెస్కో ప్రత్యేకంగా నిర్మించారు. ఈ ట్రాక్ కక్ల నుండి షిమ్లా వైపుగా 96 కి.మీ. వరకు ఉంటుంది. ఈ ట్రాక్ పై ప్రయాణం ఐదు గంటల పాటు సాగుతుంది. ఈ ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన హిమాలయాల సొగసులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి.

KTR: మూసీపై కబ్జాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు

హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఈ ట్రాక్ కింద భూభాగం లేకపోవడంతో ట్రాక్ గాలిలో వేలాడుతోంది. ప్రస్తుతానికి ఈ మార్గంలో ప్రయాణించే టాయ్ ట్రైన్ రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈ ట్రాక్ మరమ్మత్తులకు కనీసం రూ.15 కోట్లు వ్యయం అవుతుందని దాని కోసం సుమారు నెలరోజుల సమయం పడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షాలకు ఓ దేవాలయం కూడా కూలిపోయింది. ఆ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు. దీంతో చాలామంది భక్తులు మృతి చెందారు. శిథిలాల్లో 13 మృతదేహాలను అధికారులు గుర్తించారు.

Bus Catches Fire: వీళ్లు నిజంగా అదృష్టవంతులే.. లేకపోతే ప్రాణాలు పోయేవే

హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న వానలకు జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోవడంతో.. నదులను తలపిస్తున్నాయి. మరోవైపు నదులు నీటిప్రవాహానికి పోటెత్తుతూ ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఘాట్ రోడ్డు పొడవునా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో కొందరు మృతి చెందగా.. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ భారీ వర్షాల దాటికి అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.