Site icon NTV Telugu

HandBall Politics: హ్యాండ్ బాల్ క్రీడల్లో రాజకీయాలా?

Handball

Handball

క్రీడల్లో రాజకీయాలు మంచివి కావన్నారు హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జగన్మోహన్ రావ్. ఢిల్లీ హర్యాణా రాష్ట్రాలు క్రీడలను భ్రష్టుపట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఆ రెండు రాష్ట్రాలే దేశంలో క్రీడలను రూల్ చేయాలని భావిస్తున్నాయి. దానికోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నారని దుయ్యబట్టారు జగన్మోహన్ రావ్.

Read Also:Top Headlines @9PM: టాప్‌ న్యూస్‌

ఆ రెండు రాష్ట్రాలు స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అమ్ముకుంటున్నాయి. క్రీడల్లో రాజకీయ నేతల ప్రమేయం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. క్రీడలతో రాజకీయం చేయకూడదని హితవు పలికారు. మంత్రి కేటీఆర్ సమర్థులు ఆయన బ్యాడ్మింటన్ ను బాగా నడిపించగలరు. ఇక నుంచి హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఇండియా మాత్రమే అధికారిక గుర్తింపు సంస్థ అని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Yadadri Narasimhaswamy Kalyanam Live: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం

Exit mobile version