Hamas-Israel War: హమాస్ ఇజ్రాయిల్ మధ్య అక్టోబర్ 7 వ తేదీన మోగిన యుద్ధ బేరి నేటికీ కొనసాగుతూనే ఉంది. తొలుత ఇజ్రాయిల్ పైన ఆకస్మిక దాడి చేసిన వందలాది మందిని చంపింది హమాస్ . అయితే హమాస్ పైన ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. చెప్పినట్టుగానే హమాస్ పైన విరుచుకు పడింది. హమాస్ పాలనలో ఉన్న గాజా పైన బాంబుల వర్షం కురిపించిన విషయం అందరికి సుపరిచితమే. ఇజ్రాయిల్ ప్రతికార దాడిలో 4500 మందికి పైగా చనిపోయారు. అయితే ఇజ్రాయిల్ ను ఎదుర్కోవడానికి హమాస్ సైనైడ్ పూసిన ఆయుధాలను ఉపయోగించాలని యోచిస్తోందని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలకు తన కేబుల్‌లో పేర్కొన్నట్లు అమెరికాకు చెందిన మీడియా సంస్థలు నివేదించాయి.
Read also:Mohammed Shami: ఆ వికెట్‌తో నాలో మరింత నమ్మకం పెరిగింది: షమీ
అయితే ఈ ఆయుధాలను ఎలా ఉపయోగించాలి అనే పరిశోధనలను మరణించిన తీవ్రవాదుల శరీరాలపై చేసేందుకు హమాస్ ప్రయత్నించగా ఇజ్రాయిల్ అడ్డుకున్నది. దీనితో రసాయన ఆయుధాలను ఉపయోగించాలనే హమాస్ ప్రణాళిక వెలుగులోకి వచ్చింది. అలానే హమాస్ సైనైడ్ ఆధారిత ఆయుధాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తుంది అని తెలిపే ఆధారాలు కూడా ఉన్నాయి. అవే మృతదేహాలపై సైనైడ్ పరికారాలను ఎలా ఉపయోగించాలి, ఉపయోగించిన తర్వాత ఆ సైనైడ్ ఎలా శరీరంరంలో వ్యాప్తి చెందుతుంది అనే విషయాలను తెలుసుకునే క్రమంలో హమాస్ మృతదేహాలపైనా గీసిన రేఖాచిత్రాలు ఉన్నాయని యాక్సియోస్ విశ్లేషణను ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. పౌరులపై జరిగిన ఉగ్రదాడిలో భాగంగా రసాయన ఆయుధాలను ప్రయోగించాలనే ఉద్దేశంతో హమాస్ ఇలా యోచిస్తోందని ఇజ్రాయెల్ రాయబారి ఛానెల్ పేర్కొంది.