NTV Telugu Site icon

Israeli–Palestinian conflict: మరో ఇద్దరిని వదిలేస్తామన్నా ఇజ్రాయెల్ స్పందించడం లేదు.. హమాస్ ప్రకటన

Untitled 1

Untitled 1

GAZA: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన దాడి చేసి మారణహోమం సృష్టించింది. విచక్షణ రహితంగా చేసిన దాడుల్లో 1400 మందికి పైగా మరణించారు. అదే రోజు హమాస్ 200 మందికి పైగా బంధించింది. ఈ నేపథ్యంలో చంపడం మాకు వచ్చు అని నిరూపించింది ఇజ్రాయిల్. హమాస్ ఉగ్రవాదుల వికృత చేష్టలకు ఏ మాత్రం తీసిపోము అని గాజా పైన విరుచుకుపడింది. గాజా పైన బాంబుల వర్షం కురిపించింది. ఈ హృదయ విదారక ఘటనలో 4500 మందికి పైగా మరణించారు. గాజా పరిస్థితి దయనీయంగా మారింది. యుద్ధం వల్ల ఏర్పడిన సంక్షోభంతో అక్కడి ప్రజలు నీరు, ఆహరం దొరకక, తలదాచుకునేందుకు ఆశ్రయం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో హమాస్ మానవతా ప్రాతిపదికన తాను బంధించిన ఇజ్రాయిల్ ప్రజలలో ఉన్న ఇద్దరు అమెరికన్లను శుక్రవారం విడిచిపెట్టింది.

Read also:CM KCR: నేడే సద్దుల బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

మరో ఇద్దరిని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ తెలిపింది. శనివారం ఈ విషయం గురించి హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి అబు ఉబైదా మాట్లాడుతూ.. అమెరికన్లు జుడిత్ తై రానాన్ మరియు ఆమె కుమార్తె నటాలీలను శుక్రవారం విడిచిపెట్టామని.. అదే రోజు మానవతా ప్రాతిపదికన మరో ఇద్దరిని వదిలిపెడతామని చెప్పిన ఇజ్రాయిల్ స్పందించలేదని పేర్కొన్నారు. అలానే ఇజ్రాయిల్ గాజా పైన చేస్తున్న బాంబుల దాడిని విరమించుకుంటే బందీలందరినీ విడుదల చేసేందుకు హమాస్ సిద్ధంగా ఉందని తెలియ చేశారు. మానవతా ప్రాతిపదికన మరో ఇద్దరు వ్యక్తులను ఆదివారం విడుదల చేయడానికి హమాస్ సిద్ధంగా ఉందని కానీ ఇజ్రాయిల్ దీనికి అంగీకరించడం లేదని అబు ఉబైదా చెప్పారు.