NTV Telugu Site icon

Bihar : డీజే ట్రాలీకి తాకిన విద్యుత్ వైర్.. తొమ్మిది మంది మృతి

New Project (35)

New Project (35)

Bihar : బీహార్‌లోని హాజీపూర్‌లో విద్యుదాఘాతం కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీజేకు 11 వేల వోల్టుల వైర్ తగిలి విద్యుదాఘాతానికి గురై 9 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ప్రమాదం తర్వాత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా విద్యుత్ శాఖ ఉద్యోగులు వెంటనే సరఫరా ఆపలేదని వారు ఆరోపిస్తున్నారు. సరఫరా ఆపి ఉంటే చాలా మంది ప్రాణాలను కాపాడి ఉండేవారు.

Read Also:Rajanna Temple: మొట్టమెదటి సారి రాజన్న ఆలయంలో బ్రేక్‌ దర్శనాలు.. నేటి నుంచి అమలు..

కన్వారియాలను తీసుకుని వెళ్తున్న డీజే ట్రాలీకి విద్యుదాఘాతం జరిగినట్లు హాజీపూర్ ఎస్‌డిపిఓ ఓంప్రకాష్ తెలిపారు. విద్యుత్ షాక్ తో దాదాపు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది క్షతగాత్రులను సదర్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటన హాజీపూర్‌లోని ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడి చేరుకున్నారు. వైశాలి జిల్లాలోని హాజీపూర్-ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో రాత్రి 11:00 గంటలకు శివభక్తులు గ్రామం నుండి ఊరేగింపుగా బయలుదేరారు. ఫుల్ డీజే సౌండ్ తో వెళ్తున్న సమయంలో డీజే ట్రాక్టర్ ట్రాలీకి హైటెన్షన్ వైర్లు తగలడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కన్వారియాలు అక్కడికక్కడే మరణించగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల సహాయంతో క్షతగాత్రులందరినీ హాజీపూర్ లోని సదర్ ఆసుపత్రికి తరలించారు.

Read Also:Cybercrime: మీ ఫోన్ కి ఈ సందేశం వస్తే వెంటనే డిలీట్ చేయండి..లేదంటే అకౌంట్ ఖాళీ!

ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ ప్రజలు సాధారణంగా ఈ మాసంలోని మూడో సోమవారం శివుడి మొక్కుల నిమిత్తం =సోన్‌పూర్‌లోని పహెల్జా ఘాట్‌కు వెళ్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ సమయంలో అందరూ డీజే సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేశారు. ఇంతలో అకస్మాత్తుగా డీజే 11 వేల బోల్ట్ వైర్ తగలడంతో విద్యుదాఘాతంతో 9 మంది తీవ్రంగా కాలిపోయి మృతి చెందారు. పలువురు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం విద్యుత్‌ శాఖకు ఫోన్‌ చేసి లైన్‌ కట్‌ చేయమని కోరారు. కానీ అయితే అప్పటికి 9 మంది చనిపోయారని స్థానికులు తెలిపారు. మరణించిన వారిలో నలుగురు సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందినవారు కాగా, మిగిలిన ఐదుగురు నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాధువా బధాయి తోలా నివాసితులు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.