Site icon NTV Telugu

GVL Narasimha Rao : విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు భేటీ కారు..?

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

విభజన సమస్యల పరిష్కారంపై ఢిల్లీ మీద నెపం నెట్టొద్దని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు భేటీ కారని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో చొరవ తీసపకోకుండా కేంద్రాన్ని తప్పు పట్టడం కరెక్టా..? విభజన సమస్యలపై తెలంగాణ సీఎంతో గత, ప్రస్తుత ఏపీ సీఎంలు ఒక్కసారైనా మాట్లాడారా..? అని ఆయన అన్నారు. కేసీఆర్‌తో గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదన్నారు.

తెలంగాణ సీఎం తరహాలో మూడు గంటల పాటు ప్రెస్ మీట్లు పెట్టకున్నా.. మూడు నిమిషాలైనా ఏపీ సీఎం ఎందుకు మాట్లాడరని ఆయన మండిపడ్డారు. జగన్ మాట్లాడితే సెట్లర్ ఓట్ల కోసమైనా కేసీఆర్ స్పందిస్తారని, ఉదయం లేచింది మొదలు. కేసీఆర్ సెట్లర్ల ఓట్ల గురించే మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో ఉన్న కేసీఆర్ ఏపీలోని జగన్, చంద్రబాబును కంట్రోల్ చేస్తున్నారనడంలో సందేహం లేదని, వారి స్వప్రయోజనాల కోసం జగన్, చంద్రబాబు కేసీఆరుతో రాజీ పడుతున్నారని జీవీఎల్‌ ఆరోపించారు.

Exit mobile version