GV Prakash : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, హీరో అయిన జీవీ ప్రకాష్ తన 11 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ మధ్యకాలంలో ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. సింగర్ సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జీవీ ప్రకాష్ 11 ఏళ్ల తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. ఇద్దరి కాంబోలో గతంలో పలు పాటలు వచ్చాయి. ఇద్దరి కాంబినేషన్‌కి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అందుకే విడాకులు తీసుకున్న వెంటనే వారి అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఇద్దరిలో ఎవరిది తప్పు అంటూ చర్చ జరిగింది. అయితే ఇద్దరు కలిసి జీవితం సాగించలేం అని నిర్ణయం తీసుకున్నప్పుడు విడిపోవడం ఉత్తమం అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు.
Read Also:Bollywood : హిందీలో డే-1 కంటే డే- 4 ఎక్కువ రాబట్టిన పుష్ప -2
మ్యూజిక్ డైరెక్టర్ గా జీవీ ప్రకాష్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఆయన తెలుగు, తమిళ సినిమాలకు బాణీలు అందించడంతో పాటు హీరోగాను సినిమాలు చేస్తున్నారు. ఇలా బిజీ బిజీగా ఉన్న జీవీ ప్రకాష్ విడాకుల తర్వాత మొదటి సారి తన మాజీ భార్య సైంధవితో స్టేజ్ షేర్ చేసుకున్నారు. ఒక ఈవెంట్ కోసం వీరిద్దరు కలిసి ఒకే పాటను స్టేజ్‌పై పాడి చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను మెప్పించారు. వీరిద్దరి కాంబో పాటకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. వీరిద్దరూ కలిసి పాడుతున్న సమయంలో ఆడిటోరియం మొత్తం పెద్ద శబ్దాలు చేస్తూ అభిమానులు వారిపై తమ ప్రేమను చూపించారు.
Read Also:Bhatti Vikramarka: తెలంగాణ తల్లి విగ్రహం.. మార్చకుండా చట్టం..
జీవీ ప్రకాష్, సైంధవిల విడాకుల తర్వాత స్టేజ్ షో వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు నాట భారీ ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్న జీవీ కుమార్, సైంధవిల పాటకు మంచి స్పందన రావడంతో వారిద్దరి కాంబోకి ఏ స్థాయి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడిపోయిన తర్వాత కూడా ఇలా కలిసి స్టేజ్ పై కనిపించడం చాలా సంతోషంగా ఉందంటూ కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తే మరి కొందరు మాత్రం వీరిద్దరు విడిపోకుండా ఉంటే బాగుండేది కదా అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమిళనాట ఈయన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో పాటు పలు పెద్ద సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. హీరోగా తను నటించిన 15 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
Pirai Thedum song hits really hard now especially after their separation 💔🥺#gvprakashliveinkl #gvprakashconcert #GVPrakash #saindhavi pic.twitter.com/RXP3G0Wzrx
— Ramya Subhashinie ✨ (@blxckfame_) December 8, 2024