NTV Telugu Site icon

Guvvala Balaraju: నా తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నా.. వారే దాడి చేశారు

Guvvala

Guvvala

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అచ్చంపేటలో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. అంతేకాకుండా.. గువ్వల బాలరాజు నుదిటిపై గాయలుకావడంతో చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. కాసేపటి క్రితమే ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

Read Also: Kaleru Venkatesh: ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న మహిళలు, యువకులు

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడి చేసిన వారి గురించి బయటపెట్టారు. తెలంగాణలో ఎన్నడూ లేని ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యనే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేశారు.. నిన్న నామీద దాడిచేశారన్నారు. నిన్న ప్రచారం ముగించుకొని వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తన కాన్వాయ్ ని వెంబడిస్తూ అచ్చంపేట రాగానే ఆపి తన మీద దాడికి దిగారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ గతంలో తన ఆఫీసు మీద దాడి చేశారని పేర్కొన్నారు. నిన్న వంశీకృష్ణ రాయితో దాడిచేశాడని చెప్పారు. పగలు, ప్రతికారాలు లేకుండా పనిచేస్తున్నానని అన్నారు. నేను నమ్మే దైవం నా తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నా.. వంశీకృష్ణ అతని అనుచరులు నా మీద దాడి చేశారని చెప్పారు. వంశీకృష్ణ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు గువ్వల బాలరాజు తెలిపారు.

Read Also: Harish Rao: ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్‌ చేసింది కాంగ్రెస్‌ కాదా?

ఈ దాడి పిరికితనంతో చేసిన దాడి అని బాలరాజు అన్నారు. తనను ఎదుర్కొనే శక్తి లేక అంతమోదించే కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జైళ్లలో నుండి క్రిమినల్స్ ని తీసుకువచ్చి దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. తన అనుచరులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నట్లు బాలరాజు చెప్పారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.. కాంగ్రెస్ పార్టీకి దీటైన సమాధానం చెబుదామని అన్నారు.