Site icon NTV Telugu

Gutha Sukender Reddy: పునరాలోచన చేసుకోమని చెప్పా.. కవిత రాజీనామాపై స్పందించిన గుత్తా!

Gutta Sukhender Reddy

Gutta Sukhender Reddy

తన రాజీనామాను ఆమోదించమని ఎమ్మెల్సీ కే.కవిత కోరారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఎమోషనల్‌గా రాజీనామా చేశారని, పునరాలోచన చేసుకోమని తాను కవితకు సూచించానని చెప్పారు. కవిత రాజీనామాపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాను అని గుత్తా అన్నారు. నల్లగొండ జిల్లాలో చిట్ చాట్ సందర్భంగా కవిత రాజీనామాపై శాసన మండలి చైర్మన్ స్పందించారు. సొంత పార్టీపై విమర్శలు చేసిన కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు.

Also Read: Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. అయినా మగువలకు నిరాశే!

చిట్ చాట్ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలు విషయాలపై మాట్లాడారు. ‘శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ పూర్తి అయ్యే లోపు డిండి నుంచి వృథాగా సముద్రంలో కలిసే నీటిని సద్వినియోగం చేసుకోవాలి. యూరియా సరఫరా విషయంలో ప్రభుత్వ వైఫల్యం లేదు. ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చే డబ్బులు ప్రభుత్వ ఆస్పత్రులకు ఇచ్చి అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని ప్రభుత్వమే ప్రైవేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తే.. ప్రైవేట్ సంస్థల బెదిరింపులు తగ్గుతాయి. కుల, మతాల ప్రాతిపదికన రాజకీయ పార్టీల మనుగడ కొనసాగదు’ అని స్పష్టం చేశారు.

Exit mobile version