Gutha Sukender Reddy: ఉద్యోగ నియామకాల మీద బీఆర్‌ఎస్ ఇప్పడు మాట్లాడుతోంది.. ఆనాడు ఏం చేశారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. మండలి చైర్మన్ లో కుర్చీలో కూర్చున్నాం అంటే ఏ పదవికి సంబందం ఉండదన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఆర్థిక వనరులు ఉన్నా లేకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోందన్నారు. రుణమాఫీ మాట ప్రకారం పూర్తి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Read Also: Minister Komatireddy: రైతులకు గుడ్ న్యూస్.. వారంలోపు మిగిలిన వారందరికీ రుణమాఫీ!
ప్రతిపక్ష నాయకులు వాడుతున్న భాష సరిగా లేదన్నారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వాడుకున్నా.. ఇకేమైనా వాడుకున్న.. పద్ధతి ఉండాలన్నారు. ఒక పని ప్రభుత్వం చేస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ కౌంట్ చేయవద్దన్నారు. మూసీ ప్రక్షాళన కూడా అంతే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని తెలిపారు. హైడ్రా వల్లే రిజిస్ట్రేషన్‌లు పడిపోయాయని.. ఆదాయం తగ్గిందనడం కరెక్ట్ కాదన్నారు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చు పెంచారని.. దీనికి అందరూ బాధ్యులేనన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే అధికారులను ఉద్దేశించి అంతు చూస్తాం అంటున్నారన్నారు. అధికారులు పర్మనెంట్, రాజకీయా నాయకులు టెంపరరీ అని పేర్కొన్నారు. రాజకీయ నాయకుల లూప్ హోల్స్ అధికారులకు బాగా తెలుసన్నారు.