Site icon NTV Telugu

Viral : కుక్కపై మహిళ దాష్టికం.. మండిపడుతున్న జనం

Dog1

Dog1

Viral : జంతువులు మాట్లాడలేవు, కానీ అవి ప్రేమను వ్యక్తపరచగలవు. కానీ మూగ జంతువుకు సంబంధించి ఓ మహిళ క్రూరంగా ప్రవర్తించింది. ఈ ఘటన రాజధానికి ఆనుకుని ఉన్న సైబర్ సిటీ గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. ఇందులో ఇంటి పనిమనిషి లిఫ్ట్‌లో కుక్కతో చాలా క్రూరంగా ప్రవర్తించింది. లిఫ్ట్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఆమె చేసిన దారుణం రికార్డైంది.

Read Also: Prakash Ambedkar : గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రకాష్‌ అంబేద్కర్‌

గురుగ్రామ్‌లోని ఒక సొసైటీలో నివసిస్తున్న ఒక తండ్రికొడుకులు వారి ఇంటికి రెండు పరదేశీ కుక్కలను తెచ్చుకున్నారు. వాటిని ఇంటి పనిమనిషి చూసుకుంటుంది. బుధవారం ఆ మహిళ రెండు పెంపుడు కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లింది. తిరిగి వస్తుండగా లిఫ్ట్‌లోకి వెళ్లగానే పగ్‌ని అందుకుని లిఫ్ట్‌ నేలపై బలంగా ఢీకొట్టింది. ఆమె అలా మూడు సార్లు చేసింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో వైరల్‌గా మారింది.

Read Also: Crying Child : చీటికి మాటికి.. మీ పిల్లలు ఏడుస్తున్నారా.. అయితే..!

ఈ సంఘటన తర్వాత పనిమనిషిపై యజమాని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ, ఈ వైరల్ వీడియో పీపుల్ ఫర్ యానిమల్స్ అనే సంస్థకు చేరడంతో సంస్థ వాలంటీర్లు చొరవ తీసుకుని గురుగ్రామ్‌లోని బజ్‌ఘెడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఆమెపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సొసైటీ అధికారులను సంప్రదించగా.. పరువు పోతుందనే భయంతో సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు.

Exit mobile version