ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జరుగుతున్న ఎన్నికలు ఒక సెమీ ఫైనల్ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గురు ప్రకాష్ పాశ్వాన్ అన్నారు. భారత రాజకీయ చరిత్రలో దళితుడిని జాతీయ అధ్యక్షుడిని చేసింది బీజేపీనే అని తెలిపారు. దళితుడైన బంగారు లక్ష్మణ్ ను జాతీయ అధ్యక్షుడిని చేసింది.. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దళితుడిని రాష్ట్రపతి చేశారు.. దళితులను రాజ్యసభకు నామినేట్ చేశారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ దళిత, బీసీ, గిరిజన, మహిళా వ్యతిరేక పార్టీలు అని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో దళిత మహిళలకు ముగ్గురికి మంత్రులుగా అవకాశం కల్పించాం.. మాదిగ సమాజాన్ని దశాబ్దాలుగా అన్ని అంశాల్లో మోసం చేశారు.. మాదిగ సమాజానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని టికెట్లు ఇచ్చింది అనిన గురు ప్రకాష్ పాశ్వాన్ చెప్పారు.
Read Also: MLA Laxmareddy: తగ్గని జోరు అదే హుషారు.. లక్ష్మారెడ్డి సమక్షంలో భారీ చేరికలు..
ఎస్సీలకు బీజేపీ 21సీట్లు ఇచ్చింది అని గురు ప్రకాష్ పాశ్వాన్ పేర్కొన్నారు. దళిత సీఎం ఏమైందీ?.. కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క మాదిగ మంత్రి లేరు.. దళిత బందు పేరుతో బీఆర్ఎస్ సర్కారు దళితులను మోసం చేసింది.. ఇది కమిషన్ సర్కారు.. దళిత బందులో సైతం కమిషన్ తీసుకున్నారు.. బీసీలను బీజేపీ ముఖ్యమంత్రులను చేసింది.. కాంగ్రెస్ పార్టీ ఉన్నత వర్గాలకు చెందిన వాల్లనే ముఖ్యమంత్రులను చేసింది అని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ నుండి 230 మంది సీఎంలు అయితే అందులో 210 మంది బీసీ యేతరులే ఉన్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గురు ప్రకాష్ పాశ్వాన్ ధ్వజమెత్తారు.