Gurpatwant Singh Pannun: ఈ నెల 22న అయోధ్యలో జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తాం.. అలాగే, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే, అయోధ్యలో ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను శుక్రవారం యూపీ పోలీసులు అరెస్టు చేయడంతో.. ఈ మేరకు పన్నూ హెచ్చరికలు జారీ చేశాడు. ఈ ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది.
Read Also: Richest Family: వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీ.. 700కార్లు, రూ.4000కోట్ల ఇల్లు, 8జెట్లు.. అంతులేని సంపద
ఇక, ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసిన ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను భద్రతా ఏజెన్సీలు వేధింపులకు గురి చేయొద్దని గురుపత్వంత్ సింగ్ పన్నూ పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన ఓ నంబర్ నుంచి ఈ రికార్డింగ్ మెసేజ్ వచ్చినట్లు యూపీ ఏటీఎస్ అధికారులు తెలిపారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఖలిస్థానీలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో యూపీ యాంటి టెర్రరిస్ట్ విభాగం అరెస్టు చేసిన ముగ్గురు యువకుల్లో ఒకరు రాజస్థాన్‌కు చెందిన సీకర్ వాసి ధరమ్‌వీర్‌గా గుర్తించారు. అయితే, ఇటివలే గణతంత్ర దినోత్సవం రోజున పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను సైతం హత్య చేస్తానని బెదిరిస్తూ ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేశాడు.