NTV Telugu Site icon

Dera Baba: రంజిత్ సింగ్ హత్య కేసులో డేరాబాబాకు బిగ్ రిలీఫ్.. నిర్దోషిగా ప్రకటించిన హైకోర్ట్

Derababa

Derababa

Gurmeet Ram Rahim Singh: డేరా సచ్చా సౌదా అధినేత గుర్మింత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ కు పంజాబ్-హర్యానా హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింద. రంజిత్ సింగ్ హత్య కేసులో అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో డేరాబాబాతో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా జస్టిస్ సురేష్ వార్ ఠాకూర్, జస్టిస్ లలిత్ బత్రాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అత్యాచారం కేసు, జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి, డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్య కేసుల్లో డేరాబాబాను నిందితుడిగా సీబీఐ కోర్టు గతంలో తీర్పును ఇవ్వగా.. దీన్ని సవాల్ చేస్తూ డేరాబాబా హైకోర్టుని ఆశ్రయించారు. ఇందులో రంజిత్ సింగ్ హత్యకేసులో ఆయన్ని నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Read Also: Pushpa 2 : “పుష్ప 2” సెకండ్ సింగిల్ అదిరిపోనుందా..?

ఇక, జర్నిలిస్టు ఛత్రపతి హత్య కేసులో పంజాబ్- హర్యానా హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ప్రస్తుతం డేరాబాబా రోహ్ తక్ లోని సునారియా జైలులో ఉన్నారు. ఇక, డేరా బాబా అనుచరుడైన రంజిత్‌ సింగ్‌ 2002లో హత్య చేయబడినాడు. డేరాబాబా ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను గురించి ప్రస్తావిస్తూ రాసిన ఓ లేఖ అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అయితే, అది ఆశ్రమ మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ రాసినట్లు డేరాబాబా అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రంజిత్ ను హత్య చేసేందుకు డేరాబాబా కుట్ర చేసినట్లు సీబీఐ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఇద్దరు సాధ్వీలను డేరాబాబా రేప్ చేసినట్లు తేలడంతో ఆయనకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది.