Viral: ఫుడ్ పాయిజనింగ్‌కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్‌గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వైద్య ఖర్చులు, హెల్త్‌కేర్ ఇన్ఫ్లేషన్ పై సామాజిక మాధ్యమాల్లో మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గుర్గావ్లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో సాధారణ ఫుడ్ పాయిజనింగ్ చికిత్సకు ఏకంగా రూ. 65,000 కంటే ఎక్కువ బిల్లు వేయడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన హాస్పిటల్ బిల్లు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అభిమన్యు మిట్టల్ అనే వ్యక్తి ఈ బిల్లును తన ఎక్స్ (X) ఖాతాలో పంచుకుంటూ.. “గుర్గావ్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో అక్యూట్ ఫుడ్ పాయిజనింగ్ చికిత్సకు రూ. 65 వేల బిల్లు వేశారు. ప్రస్తుత రోజుల్లో రోగం కంటే కూడా ఈ వైద్య బిల్లులు చూస్తుంటేనే ఎక్కువ భయమేస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అదనపు సదుపాయం కాదు.. బతకడానికి అవసరమైన ప్లానింగ్” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన షేర్ చేసిన బిల్లులో కేవలం రూమ్ ఛార్జీల కోసమే ఏకంగా రూ. 37,500 వసూలు చేయగా, మిగిలిన మొత్తాన్ని ల్యాబ్ ఫీజులు, ఫార్మసీ, కన్సల్టెంట్ ఫీజుల పేరిట లెక్కగట్టారు.
Also Read
- Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
- IND Vs PAK: హై-వోల్టేజ్ పోరుకు వేళాయె.. పాకిస్థాన్‌తో తలపడనున్న ఇండియా..
- Rahul Gandhi: ఆంగ్ల భాష ఖూనీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రొఫెసర్ అక్షర దోషాలు.. వైరల్
- Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్‌పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
₹65k for acute food poisoning at a well-known Gurgaon hospital. At this point, medical inflation is scarier than the illness itself. 💀
Health insurance is no longer a “good to have” — it’s survival planning.#insurance @SanjayYada7n @themahavir @NIKHILLJHA @ccg33k #ccgeeks pic.twitter.com/6mVUuVyST6
— Abhimanyu Mittal (@abhimittal007) May 23, 2026
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఆసుపత్రుల దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. “మధ్యతరగతి కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టడమే ఒక పెద్ద భారం అయిపోయింది. కనీసం రూ. 1 కోటి పాలసీ లేకపోతే ఏవీ కవర్ కావడం లేదు” అని కామెంట్ చేయగా.. మరొకరు వ్యంగ్యంగా.. “రూమ్ కోసం రూ. 37,500 వసూలు చేశారు.. మీరు ఏమైనా సూపర్ డీలక్స్ రూమ్ తీసుకున్నారా?” అని ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లో సామాన్యుడికి నాణ్యమైన వైద్యం ఎంత భారంగా మారిందో ఈ వైరల్ బిల్లు మరోసారి నిరూపించింది.
తాజావార్తలు
-
Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
-
JNTU Hyderabad : JNTUHలో పదవుల పోరు.. బలి అవుతున్న విద్యార్థుల భవిష్యత్తు?
-
IND Vs PAK: హై-వోల్టేజ్ పోరుకు వేళాయె.. పాకిస్థాన్‌తో తలపడనున్న ఇండియా..
-
CM Revanth Reddy : అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు తాకుతున్న తెలంగాణ
-
Rahul Gandhi: ఆంగ్ల భాష ఖూనీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రొఫెసర్ అక్షర దోషాలు.. వైరల్
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!