ఐపీఎల్ 16వ సీజన్‌లో 30వ మ్యాచ్ నేడు ఎకానా స్పోర్ట్జ్ సిటీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఢీ కొట్టింది. అయితే.. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. అయితే.. 136 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లక్నో 55 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే.. కెఎల్ రాహుల్ 61 బంతుల్లో 68 పరుగులతో వర్ణించలేని రీతిలో బ్యాటింగ్ చేసినప్పటికీ..ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Also Read : Shivathmika: ఎద అందాలు చూపిస్తూ బర్త్ డే ట్రీట్ ఇచ్చిన శివాత్మిక
136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఎల్‌ఎస్‌జి ఒక దశలో దూసుకెళ్లింది. కానీ.. కేఎల్ రాహుల్ 68 పరుగులు చేసి భారీ షాట్ కొట్టే యత్నంలో జయంత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టొయినిస్ కూడా మోహిత్ శర్మ విసిరిన బంతికి లాంగాన్ లో దొరికిపోయాడు. అనంతరం ఆయుష్ బదోనీ, దీపక్ హుడా వరుస బంతుల్లో రనౌట్ కావడంతో లక్నో ఆశలు అడుగంటాయి. చివరి బంతికి రవి బిష్ణోయ్ పరుగులేమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయాడు. మొత్తమ్మీద అనూహ్య రీతిలో గుజరాత్ టైటాన్స్ 7 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. మోహిత్ శర్మ ఆఖరి ఓవర్లో 12 పరుగులను డిఫెండ్ చేశాడు.
Also Read : Nushrratt Bharuccha: రాజమౌళి నార్త్ స్టార్ ని కూడా తెలుగుకి వచ్చేలా చేశాడు