Gujjula Premender Reddy : స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కారు

Gujjula Premender Reddy

Gujjula Premender Reddy

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను కలిసి స్పీకర్‌పై బీజేపీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాధవి లత కంప్లైంట్ చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలువడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తుందన్నారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి స్పీకర్ పాల్గొన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలువడానికి అన్ని అబద్దపు ప్రచారాలను చేస్తుందని ఆయన అన్నారు. గ్యారెంటీల ముసుగులో ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఇచ్చిన ఏ గ్యారెంటీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని, బీఆర్ఎస్ తన పదేళ్ల హయాంలో ప్రజలను మోసం చేసిందని ఆయన పేర్కొన్నారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ప్రేమేందర్‌ రెడ్డి అన్నారు. ప్రజలు నరేంద్ర మోడీ మరోసారి గెలవాలని కోరుకుంటున్నారని, ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ స్పీకర్ ను కూడా వాడుకుంటుందన్నారు.