Site icon NTV Telugu

GT vs LSG : ఐదు పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌

Lsg Vs Gt

Lsg Vs Gt

ఐపీఎల్‌ 2023లో భాగంగా నేడు ఎకానా స్పోర్ట్జ్ సిటీ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌-గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న గుజరాత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. కృనాల్‌ పాండ్యా వేసిన రెండో ఓవర్‌లోనే శుభ్‌మన్‌ గిల్‌ (0) ఔటయ్యాడు.3 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 13/1. సాహా (9), హార్ధిక్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్‌ జట్టు బ్యాటింగ్‌లో తడబడుతున్నది. తొలి ఐదు ఓవర్లు ముగిసేసరికి కేవలం మూడు బౌండరీలు మాత్రమే రాబట్టింది. ఆ మూడు బౌండరీలను వృద్ధిమాన్‌ సాహా కొట్టాడు. ప్రస్తుతం సాహా 25, హార్దిక్‌ పాండ్యా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కాగా, లక్నో సూపర్‌ జెయింట్స్ జట్టు ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించింది. గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు నమోదు చేసుకుంది. పాయింట్ల పట్టికలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్‌ టైటాన్స్‌ నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.

గుజరాత్‌ టైటాన్స్‌: వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), శుభ్‌మాన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), విజయ్‌ శంకర్‌, అభినవ్‌ మనోహర్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌, మొహమ్మద్‌ సమీ, నూర్‌ అహ్మద్, మోహిత్‌ శర్మ.
లక్నో సూపర్‌ జెయింట్స్‌: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), కైల్‌ మేయర్స్‌, దీపక్‌ హుడా, మార్కస్‌ స్టోయినిస్‌, కృనాల్‌ పాండ్యా, నికోలస్‌ పూరన్‌ (వికెట్‌ కీపర్‌), ఆయుష్‌ బదోనీ, నవీన్‌ ఉల్‌ హక్‌, అమిత్‌ మిశ్రా, ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌.

Exit mobile version