Gujarat News : ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు మరీ దిగజారుతున్నాయి. అనైతిక సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. క్షణికానందం కోసం కట్టుకున్న వారిని కాలదన్నుకుంటున్నారు. అలాంటి ఘటనలోనే ఓ మహిళ చేసిన పనికి.. ఆమె భర్త తన బట్టలిప్పి నడి వీధుల్లో ఊరేగించాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులంతా చూస్తుండగానే భర్త తన భార్యను బట్టలు విప్పి రోజుల తరబడి ఊరేగించాడు. ఇది దాహోద్ జిల్లాలో మే 28న జరిగింది, కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also:YV Subbareddy: జూన్ నెలాఖరుకి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు పూర్తవుతాయి
వివరాల్లోకి వెళితే…మెష్నా జిల్లా చనాస్మా గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. అయితే ఏడాదిన్నర క్రితం భర్త, తన నలుగురు పిల్లలను వదిలి జంపయ్యింది. ఆమె వేరే వ్యక్తితో కలసి సహజీవనం చేస్తోంది. దీంతో మొదటి భర్త భార్యపై పగ పెంచుకున్నాడు. అయితే రెండో భర్త గ్రామమైన రాంపురాలో వారి బంధువుల వివాహం ఉండడంతో అతడి తల్లి వారిని ఆహ్వానించింది. రెండో భర్తతో కలిసి రాంపుర చేరుకుంది. మహిళ మొదటి భర్తను కూడా రెండో భర్త తల్లి ఆహ్వానించింది. అలా పెళ్లి వేడుకకు ఒక్కచోటుకే ముగ్గురు వచ్చారు.
మొదటి భర్త తన భార్యను కారులో కిడ్నాప్ చేసి మర్గాల గ్రామానికి తీసుకొచ్చాడు. అక్కడ అందరి ముందు ఆమె బట్టలు విప్పేశాడు. దారుణంగా కొట్టి చిత్ర హింసలు పెట్టాడు. అంతటితో గ్రామస్తుల ముందే ఆమెను నగ్నంగా ఊరేగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసి విచారిస్తున్నారు.
Read Also:Pakistan: చంద్రుడిని చూసినమని అబద్ధం చెప్తే పాకిస్తాన్ లో 10 లక్షల జరిమానా