Gujarat VS Panjab:ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా పంజాబ్-గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ ముగిసే సరికి పంజాబ్ 10 వికెట్ల నష్టానికి142 రన్లు చేసింది. గుజరాత్ ముందు స్వల్ప లక్ష్యం ఉంచింది. గుజరాత్ బౌలర్లు పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 35 పరుగులు తీశాడు. మోహిత్ శర్మ చేతిలో ఔటయ్యాడు. శ్యామ్ కరణ్(20), రిలీ రోసావ్ (9), జితేశ్ శర్మ(13), లివింగ్ స్టోన్(6), శశాంక్ సింగ్(8), అశుతోష్ శర్మ(3), హర్ ప్రీత్ బ్రార్(29), హర్షల్ పటేల్(0), భాటియా(13), రబాడ(1) చొప్పున రన్లు సాధించారు. సిమ్రాన్, బ్రార్, కరణ్ ఫర్వాలేదని పించారు. ధావన్, బెయిన్ స్టోన్ లేని లోటు మ్యాచ్లో కనబడింది. ఒక వేళ వారు మ్యాచ్ ఆడి ఉంటే స్టోర్ మరింత పెరిగే అవకాశం ఉండేది.
READ MORE: Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే యత్నం చేస్తే.. బీఆర్ఎస్ ను నామారూపాలు లేకుండా చేస్తాం
క్రమంగా వికెట్లు కోల్పోయిన పంజాబ్ చివరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 142 రన్లకే ఆలౌటైంది. షారుఖాన్ వేసిన 17వ ఓవర్లో రివ్యూతో తన వికెట్ ను కాపాడు కున్నాడు భాటియా. ఆ ఓవర్లో తొలిబంతిలోనే ఎంపైర్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అని ప్రకటించాడు. పంజాబ్ రివ్యూకి వెల్లడంతో ఫలితంగా నాటౌట్ గా థర్డ్ అంపైర్ నుంచి సమాధనం వచ్చింది. తరువాత ఏడు బంతుల్లో కేవలం ఏడు పరుగులు మాత్రే చేశాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు చెలరేగారు. సాయి కిషోర్ 4 వికెట్లు తీసి టీంకి చేయూత నందించాడు. మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
Gujarat VS Panjab: గుజరాత్ ముందు స్వల్ప లక్ష్యం..

Rs