NTV Telugu Site icon

Viral video: రీల్స్ కోసం బరితెగింపు.. సముద్రంలోకి వాహనాలు తీసుకెళ్లి ఏం చేశారంటే..!

Aeke

Aeke

ఈ మధ్య యువతకు రీల్స్ పచ్చి మరింత ముదిరింది. ఏం చేస్తున్నారో వారికే అర్థం కాక హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ యువతి డేంజరస్ స్టంట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పాడుపడ్డ భవనం పైకి యువతీయువకులు ఎక్కారు. ఒకరు కెమెరా పట్టుకోగా.. మరొకరు భవనంపై నిటారుగా పడుకొని ఉన్నాడు. ఆ అమ్మాయి స్టంట్ చేయడం ప్రారంభించింది. పై నుంచి మెల్లిగా కిందకి దిగింది. ఆ సమయంలో యువకుడు అమ్మాయి చేయి పట్టుకొని ఉన్నాడు. ఈ ఘటన పుణెలో చోటుచేసుకుంది. నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు దృష్టికి చేరి వారిని అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: NTA: ఎన్టీఏ పని ఏమిటి?.. ఇక్కడ ఉద్యోగం ఎలా సాధించాలి?

తాజాగా గుజరాత్‌లో ఇద్దరు యువకులు ప్రమాకర రీల్స్‌ చేశారు. ఏకంగా రెండు పెద్ద వాహనాలను సముద్రంలోకి తీసుకెళ్లి స్టంట్ చేసేందుకు రెడీ అయ్యారు. కాకపోతే రెండు వాహనాలు ఇసుకలో కూరుకుపోయాయి. తీరం లోపలికి వెళ్లడంతో వాహనాలు లోతైన నీటిలో కూరుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే వాహనాలు వెలికి తీసేందుకు స్థానికులు సహకరించారు. ఈ వీడియో పోలీసులు దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: SP Alam : ఆదిలాబాద్ జిల్లాలో గుట్కా పై ఉక్కు పాదం

Show comments