Site icon NTV Telugu

GT vs DC: చితక్కొట్టిన జోస్ బట్లర్.. గుజరాత్ ఘన విజయం..

Gt11

Gt11

అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్‌కు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జోస్ బట్లర్(97) చితక్కొట్టాడు. కానీ సెంచరీ చేయలేక పోయాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 43 అద్భుతంగా రాణించాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ (36) దూకుడుగా ఆడాడు. శుభ్‌మాన్ గిల్ కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు.. ఢిల్లీ బౌలర్లు ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ రెండింటిలో మాత్రమే ఓటమి పాలైంది.

READ MORE: BJP MP: సుప్రీంకోర్టు పరిధి దాటుతోంది.. మత యుద్ధాన్ని ప్రేరేపిస్తే బాధ్యత మీదే..

కాగా.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 203 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్లు అభిషేక్ పొరెల్ (18), కరుణ్‌ నాయర్ (31) దూకుడు ప్రదర్శించారు. తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (28) మెరిశాడు. అక్షర్ పటేల్ (38), ట్రిస్టన్ స్టబ్స్ (31) అద్భుతంగా రాణించారు. చివర్లో అశుతోష్ శర్మ (37) విరుచుకుపడ్డాడు. బ్యాటర్లు అందరూ సమష్టిగా భారీ స్కోరు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ నాలుగు వికెట్లు తీయగా.. అర్షద్‌ ఖాన్, సిరాజ్‌, ఇషాంత్ శర్మ, సాయి కిశోర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Exit mobile version