NTV Telugu Site icon

IPL 2024: గుజ‌రాత్ టైటాన్స్‌లోకి గిల్ ఎంట్రీ.. స్ట‌యిలిష్ లుక్‌లో అదిరిపోయాడుగా!

Shubman Gill Ipl Entry

Shubman Gill Ipl Entry

Shubman Gill joins Gujarat Titans ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 17వ సీజన్ మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. ఐపీఎల్ 2024 కోసం క్రికెట‌ర్లు అందరూ సిద్ద‌మ‌వుతున్నారు. టోర్నీకి స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో ప్లేయర్స్ తమ తమ జ‌ట్టుతో క‌లుస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మ‌న్ గిల్ గుజ‌రాత్ టైటాన్స్ క్యాంప్‌లో చేరాడు.

శుభ్‌మ‌న్ గిల్ ఈరోజే గుజ‌రాత్ టైటాన్స్ క్యాంప్‌లో చేరాడు. కొత్త కెప్టెన్ గిల్ కోసం ప్రాంచైజీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గిల్ నడుచుకుంటూ వస్తుండగా.. ఇరువైపులా టపాసులు పేల్చారు. బ్లాక్ కోట్, పాయింట్ వేసుకున్న గిల్.. హీరోలా ఎంట్రీ ఇచ్చాడు. అతడికి గుజ‌రాత్ ప్రాంచైజీ ఘన స్వాగతం పలికింది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలను గుజ‌రాత్ టైటాన్స్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. గిల్ స్ట‌యిలిష్ లుక్‌లో ఉన్నాడని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Jio Cricket Packs: ఐపీఎల్ 2024 కోసం రెండు డేటా ప్యాక్‌లు.. జియో యూజర్లకు పండగే!

ఐపీఎల్ 2023 ఆరంభంలోనే గాయ‌ప‌డి టోర్నీ మొత్తానికి దూర‌మైన కేన్ విలియ‌మ్స‌న్ సైతం గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుతో క‌లిశాడు. ఈ ఇద్ద‌రు స్టార్ ఆట‌గాళ్ల ఫొటోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు 2022లో అరంగేట్రం చేసింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో తొలి సీజ‌న్‌లో గుజ‌రాత్ ట్రోఫీని గెలుచుకోగా.. గతేడాది ర‌న్న‌ర‌ప్‌తో సరిపెట్టుకుంది. హార్దిక్ ఈసారి ముంబైకి మారడంతో.. గిల్ జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. గిల్ ఏమేర‌కు రాణిస్తాడో? చూడాలి. 17వ సీజ‌న్ తొలి మ్యాచ్‌లో గుజ‌రాత్ మార్చి 24న ముంబైతో త‌ల‌ప‌డ‌నుంది.

Show comments