NTV Telugu Site icon

IPL 2025 GT: బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్ పటేల్‌ను నియమించుకున్న గుజరాత్ టైటాన్స్

Parthiv Patel

Parthiv Patel

IPL 2025 GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కి ముందు గుజరాత్ టైటాన్స్ (GT) పార్థివ్ పటేల్‌ను తమ సహాయక సిబ్బందిలో చేర్చుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్‌ను నియమించారు. అతను గతంలో ముంబై ఇండియన్స్ (MI)కి స్కౌట్‌గా, ముంబై ఎమిరేట్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇంతకు ముందు అతను చాలా జట్లతో కలిసి ఐపీఎల్ ఆడాడు. ఈ సందర్బంగా గుజరాత్ టైటాన్స్ అధికారిక ప్రకటన చేస్తూ.. టైటాన్స్ రాబోయే ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతోంది. పార్థివ్ జట్టు బ్యాట్స్‌మెన్స్ కు కీలక పాత్ర పోషిస్తాడు. అతను యువ ప్రతిభకు మార్గనిర్దేశం చేయడం, కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేయడం, వారి అభివృద్ధికి దోహదపడటం వంటి వాటికి ప్రసిద్ధి చెందాడు. ఇకపోతే, గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో విఫలమైంన సంగతి తెలిసిందే.

Read Also: JIO Data Recharge: జియో కస్టమర్స్‭కు బంపర్ ఆఫర్.. రూ.11కే 10జిబి డేటా

ఐపీఎల్ 2024లో, గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో 5 మ్యాచ్‌లను గెలచి, 7 మ్యాచ్లలో ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ జట్టు 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. అయితే , ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్య నేతృత్వంలో ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. పార్థివ్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ , కొచ్చి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌తో సహా 6 జట్లకు ఆడాడు. అతను ఐపీఎల్ 2020లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఉన్నాడు. కానీ, అతనికి ఏ మ్యాచ్‌నూ ఆడే అవకాశం రాలేదు. అతను 139 IPL మ్యాచ్‌లలో 22.6 సగటుతో 2,848 పరుగులు చేశాడు. ఇందులో 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Read Also: MS Dhoni Cast Vote: ఇదేం క్రేజ్ భయ్యా.. ఓటు వేయడానికి వచ్చిన ధోనికి ఏకంగా?

భారతదేశం తరపున 25 టెస్టుల్లో 31 సగటుతో 934 పరుగులు చేసిన పార్థివ్ డిసెంబర్ 09, 2020న రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను టెస్టుల్లో 6 హాఫ్ సెంచరీలు చేశాడు. అందులో 71 అతని అత్యధిక స్కోరు. భారత్ తరఫున అతను 38 వన్డేల్లో 4 హాఫ్ సెంచరీల సాయంతో 736 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 95. ఇక అతను కేవలం 2 T-20 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. అందులో అతను 36 పరుగులు చేశాడు.

Show comments