ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 224 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రిషబ్ పంత్ (88*) పరుగులతో రాణించాడు. అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. మరో బ్యాటర్ అక్షర్ పటేల్ కూడా (66) పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరును చేయగలిగింది. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి.
congress: మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. వారెవరంటే?
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో పృథ్వీ షా (11) పరుగులు, జేక్ ఫ్రేసర్ (23), షాయ్ హోప్ (5), చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (26) పరుగులతో రాణించాడు. చివరి ఐదు ఓవర్లలో ఢిల్లీ 97 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ వేసిన ఓవర్లో పంత్ 31 పరుగులు చేశాడు. ఒకానొక సమయంలో ఢిల్లీ 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అక్షర్ పటేల్, పంత్ మధ్య 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక.. గుజరాత్ బౌలింగ్ లో కేవలం సందీప్ వారియర్ 3 వికెట్లతో చెలరేగాడు. నూర్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. మిగతా బౌలర్లంతా వికెట్లు తీయడంలో విఫలమయ్యారు.