Gujarat High Court: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సంజయ్ సింగ్‌లకు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోడీ విద్యార్హతపై ప్రశ్నలు లేవనెత్తిన అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు కోర్టు నుంచి ఊరట లభించలేదు. క్రిమినల్, పరువు నష్టం కేసులో ఇరువురు నేతలపై జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
Read Also: Gangula Kamalakar: బీసీ గణన ఎలా చేస్తారు? క్లారిటీ ఇవ్వండి..
ఇక, కేజ్రీవాల్, సంజయ్ సింగ్ దరఖాస్తులను తిరస్కరించిన జస్టిస్ హస్ముఖ్ సుతార్, ట్రయల్ కోర్టు ముందు తమ సమర్పణలు చేయాలని ఇద్దరు ఆప్ నేతలను ఆదేశించింది. కాగా, ప్రధానమంత్రి మోడీ డిగ్రీకి సంబంధించి అవమానకరమైన ప్రకటనలపై గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మెట్రోపాలిటన్ కోర్టు గత ఏడాది ఏప్రిల్ 15 న కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత ఇద్దరు నేతలు సమన్లను సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. అయితే, సెషన్స్ కోర్టు సమన్లను సమర్థించింది.. ఆ తర్వాత వారు మధ్యంతర స్టే కోసం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా దాన్ని న్యాయస్థానం తిరస్కరించింది.
Read Also: Mahesh -Rajamouli : మహేష్ -రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా?
అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ లు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించగా.. అక్కడ కూడా వారి అభ్యర్థనలను స్వీకరించడానికి కోర్టు నిరాకరించింది. కాగా, ప్రధాని మోడీ విద్యార్హతకు సంబంధించిన కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఉత్తర్వులను హైకోర్టు గత ఏడాది మార్చిలో పక్కన పెట్టిన తర్వాత జీయూ రిజిస్ట్రార్ పీయూష్ పటేల్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. కేజ్రీవాల్‌కు రూ. 25,000 వేల జరిమానా విధించడంతో పాటు ఆ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి కూడా ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. మోడీ డిగ్రీపై గుజరాత్ యూనివర్సిటీని లక్ష్యంగా చేసుకుని కేజ్రీవాల్, సంజయ్ సింగ్ మీడియా సమావేశాలు, సోషల్ మీడియాలో పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని జీయూ తన ఫిర్యాదులో పేర్కొనింది.