Site icon NTV Telugu

Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. కీలక నేత గుడ్‌బై

Re

Re

సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. కానీ ఇంతలోనే ఆ పార్టీ ముఖ్య నేతలు పార్టీని వీడడం కలవరపెడుతోంది.

ఇప్పటికే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్, మాజీ ప్రధాని లాల్ బహుదర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రితో సహా పలువురు నేతలు హస్తానికి గుడ్‌బై చెప్పారు. తాజాగా అదే కోవలోకి మరొక కీలక నేత వచ్చి చేరారు.

గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ మోద్వాడియా (Arjun Modhwadia) ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా తన ఎమ్మెల్యే ప‌ద‌వికి సైతం రాజీనామా చేస్తూ గుజ‌రాత్ అసెంబ్లీ స్పీక‌ర్‌కు రాజీనామా లేఖను అంద‌చేశారు. పార్టీ నుంచి వైదొల‌గుతున్నాన‌ని కాంగ్రెస్ అధ్యక్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు ఆయ‌న లేఖ పంపారు. దీంతో నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో ఉన్న బంధం తెగిపోయింది. 2022 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మోద్వాదియా పోర్‌బంద‌ర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

లేఖలో ఏముందంటే..
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఖర్గేకు లేఖ పంపించారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకాకపోవడం బాధ కల్గించిందని తెలిపారు. ఆహ్వానాన్ని తిరస్కరించడం దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీశాయని చెప్పుకొచ్చారు. ప్రజల మనోభావాలను అంచనా వేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. ఈ పవిత్ర సందర్భం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాహుల్‌గాంధీ అసోంలో రచ్చ సృష్టించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఇది భారత పౌరులను, కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను మరింత దెబ్బతీశాయని లేఖలో మోద్వాడియా పేర్కొన్నారు.

 

Exit mobile version