Bhupendra Patel: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు వచ్చి రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా సమర్పించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్ర బీజేపీ లెజిస్లేచర్ పార్టీ రేపు ఉదయం 10 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు గవర్నర్‌ను కలిసి అపాయింట్‌మెంట్ కోరారు.
కొత్త గుజరాత్ కేబినెట్ డిసెంబర్ 12న ముఖ్యమంత్రితో పాటు ప్రమాణం చేయనుంది. ఇందులో డజనుకు పైగా మంత్రులు ప్రమాణం చేస్తారు. గుజరాత్‌లో చారిత్రాత్మకమైన ఆధిక్యత సాధించిన బీజేపీ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని, ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం డిసెంబర్ 12న జరుగుతుందని పేర్కొంది. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. భూపేంద్ర పటేల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం డిసెంబర్ 12న జరుగుతుందని పాటిల్ తెలిపారు.
Himachal Pradesh: ఓట్ల శాతంలో తేడా 0.90 మాత్రమే.. ఆ 20 వేల ఓట్లే బీజేపీ రాతమార్చాయి..
బీజేపీ గుజరాత్‌లో రికార్డు స్థాయిలో 156 సీట్లు గెలుచుకుని 52.5 శాతం ఓట్లతో వరుసగా ఏడోసారి విజయం సాధించింది. దీనికి విరుద్ధంగా, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ వరుసగా 27 శాతం, దాదాపు 13 శాతం ఓట్లను పొందాయి. కాంగ్రెస్ కేవలం 17 సీట్లు గెలుచుకోగా, ఆప్ ఐదు స్థానాలను కైవసం చేసుకుంది.
