Site icon NTV Telugu

Gujarat Elections: గుజరాత్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 56.88 శాతం ఓటింగ్ నమోదు

Gujarat Elections 2022

Gujarat Elections 2022

Gujarat Elections: గుజరాత్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. తొలి విడతలో 56.88 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. చిన్న చిన్న ఘటనలు, అధికార ప్రతిపక్షాల ఆరోపణల మధ్య పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 13,065 పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. గుజరాత్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన తొలిదశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియగా.. గురువారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

Sidhu MooseWala Case: ప్రభుత్వం ఇవ్వలేకపోతే నేను 2 కోట్లు చెల్లిస్తాను.. సిద్ధూ మూసేవాలా తండ్రి ప్రకటన

గురువారం ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటలకు వరకు జరిగింది. తొలిదశలో 89 స్థానాలకు మొత్తం 788 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని నమోదు చేసుకున్నారు. గురువారం దక్షిణ గుజరాత్‌లోని 19 జిల్లాలు, కచ్‌ సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఓటింగ్ జరిగింది. 788 మంది అభ్యర్థుల్లో 718 మంది పురుషులు.. 70 మంది మహిళలు తమ అదృష్టాన్ని నమోదు చేసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఆప్‌ 88 స్థానాల్లో పోటీకి దిగింది. బీఎస్పీ 57, బీటీపీ 14, ఎస్పీ 12, వామపక్షాలు 6 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. 339 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి దశలో భాజపా తొమ్మిది, కాంగ్రెస్ ఆరు, ఆప్ ఐదుగురు మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది.

Exit mobile version