NTV Telugu Site icon

Pepper X: మిర్చికే గాడ్ ఫాదర్.. యమ హాట్ గురూ..!

Pepper X

Pepper X

Pepper X: కారంకే ఘాటు తెప్పించే మరో కొత్త రకం ఒక మిరపకాయ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత కారంతో కలిగి ఉంటుందట. పెప్పర్ ఎక్స్ పేరుతో ఇదొక వింత ఆకారాన్ని కలిగి ఉంది. ఈ మిరపను ‘వరల్డ్ హాటెస్ట్ పెప్పర్’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఇంతకుముందు వరకు కరోలినా రీపర్ రకం ఉండేది.. ఇప్పుడు పెప్పర్ ఎక్స్ రావడంతో దానిని వెనక్కి నెట్టేసింది. పెప్పర్ ఎక్స్ 2.69 మిలియన్ స్కోవిల్లే హీట్ యూనిట్లను నమోదు చేసింది. కరోలినా రీపర్ రకం మిరపలో స్కోవిల్లూ హీట్ యూనిట్లు 1.64 మిలియన్ యూనిట్లుగా కావడం గమనించొచ్చు.

Read Also: Journalist Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో సాకేత్ కోర్టు కీలక తీర్పు

స్కోవిల్లే హీట్ యూనిట్ అనేది మిరపలో ఉండే కారానికి సంబంధించి కొలమానం. ఇది ఎంత ఎక్కువ యూనిట్లు ఉండే ఆ మిరపలో మంట, వేడి ఉంటుందని అర్థం. ఈ ఘాటు మిర్చి..(పెప్పర్ ఎక్స్) అనే మిరప రకాన్ని పదేళ్లు కష్టపడి ఎడ్ కర్రీ అనే వ్యక్తి ముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా.. దీనిపై ఆయన పేటెంట్ కూడా పొందారు. పెప్పర్ ఎక్స్ తిన్న మూడున్నర గంటల పాటు వేడి (మంట) ఎక్కువగా ఉందని దీన్ని కనిపెట్టిన కర్రీ తెలిపారు. ఇదిలా ఉంటే.. పెప్పర్ ఎక్స్ కోసం ఇన్నేళ్ల పాటు కష్టపడిన తన కుటుంబం, పనివారు దీన్నుంచి ప్రయోజనం పొందాల్సి ఉందన్నారు. ఆ తర్వాతే దీని విత్తనాలను విక్రయిస్తామని ఎడ్ కర్రీ ప్రకటించారు.

Read Also: Israel-Hamas War: ఇజ్రాయిల్ చేరుకున్న జో బైడెన్.. హమాస్ ఐసిస్ కన్నా దారుణంగా ప్రవర్తించింది.