Gudivada Amarnath: ఏడాదిన్నర కాలంగా చంద్రబాబు పట్టుకుని తిరుగుతున్న గ్యారెంటీ కార్డుకు వారంటీ అయిపోయింది అంటూ సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మంత్రి అమర్నాథ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను వందశాతం అమలు చేస్తామనే నమ్మకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని తెలిపారు.. అందుకే ఈనెల 26న రాబోయే ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని వెల్లడించారు.. ఇప్పటికే అమలు అవుతున్న సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికలకు మించి ఇప్పుడు వచ్చే మేనిఫెస్టో వుండే అవకాశం ఉందన్నారు.. ఇక, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి లోకల్ మేనిఫెస్టో ప్రకటిస్తామని పేర్కొన్నారు..
Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. ఫ్లైఓవర్‌కు వేలాడుతున్న యువకుడి మృతదేహం!
మరోవైపు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు.. పారిశ్రామిక, పర్యాటక సమగ్ర అభివృద్ధిపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు వచ్చాయి.. వాటన్నింటినీ క్రోడీకరించి లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను అని వెల్లడించారు మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్.. కాగా, ఈసారి గాజువాక అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతోన్న మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు.. తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా చెబుతూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై విరుచుకుపడుతున్నారు గుడివాడ అమర్నాథ్.